బ్రేకప్ చెప్పిందని.. ప్రేయసిని కారులో తీసుకెళ్లి..
హైదరాబాద్‌లోని కుషాయిగూడలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందని ప్రియురాలిపై ప్రియుడు కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తనని తాను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ప్రేమ అంటే సెల్ ఫోన్ చాటింగులు, వాట్సప్ లో స్టేటస్‌లు, బైకులపై షికార్లు, పార్కులలో తిరగడం, పబ్బులలో ఎంజాయ్ చేయడం కాదు. అసలైన ప్రేమంటే.. ప్రేమించిన వాళ్లు తప్పు చేసిన సమర్థించే తత్వం. తమ ప్రేమను నిరాకరించినా అంగీకరించే స్వభావం. తన కంటే మనం ప్రేమించే వాళ్లు బాగుండాలని కోరుకోవడం.. అదే నిజమైన ప్రేమ. కానీ, అలాంటి ప్రేమలు.. ప్రేమ కథలు.. ఈ రోజుల్లో కనిపించడం లేదు.
నేటి ప్రేమలో స్వచ్చత కనిపించడం లేదు. తమ అవసరాల కోసం ఇతరులను వాడుకోవడం. తమ కోరికలు తీరగానే వారికి బ్రేకప్ చెప్పుకోవడం కామన్ అయిపోయింది. ఈ తరుణంలో మాజీలను బ్లాక్ మెయిల్ చేయడం. లేదంటే.. వారిపై దాడికి పాల్పడటం. తాజాగా అలాంటి ఘటననే వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ప్రాణాలు తీసేస్తున్నారు. తనను గాయపరుచుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. డీఏఈ కాలనీకి చెందిన మెరుగు వంశీ, మౌలాలీ ఎంజే కాలనీలో నివసించే ఓ యువతి చిన్ననాటి నుండి మంచి స్నేహితులు. వాళ్లిదరూ ఒకే బడిలో చదువుకున్నారు. ఒకే కాలేజ్ జాయిన్ అయ్యారు. కాలం గడుస్తున్న కొద్దీ వారి స్నేహం కూడా ప్రేమగా మారింది. ఏం జరిగిందో ఏమో గానీ.. ఇటీవల వారి ప్రేమకు బ్రేకులు పడ్డాయి. ఆ యువతి తనను మర్చిపోవాలని ప్రియుడికి చెప్పింది. బ్రేకప్ చెప్పడంతో తట్టుకోలేక వంశీ తన ప్రియుడుపై పగ పెంచుకున్నాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కవద్దని.. ఆమెను చంపేయాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో శనివారం ఆమెకు ఫోన్ చేసి.. చివరి సారిగా మాట్లాడాలని నమ్మబలికాడు.
ఈ క్రమంలో ఇద్దరు కలిసి కారులో డీఏఈ కాలనీకి వెళ్లారు. కాలనీలో ఓ మూలన కారు ఆపి మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే బ్రేకప్ ఎందుకు చెప్పావని వంశీ ఆమెతో గొడవ దిగాడు. అంతలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో పొట్ట, మెడపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆమె కేకలు వేయడంతో ఇరుగు పొరుగు గమనించి.. అక్కడకు చేరుకున్నారు. అంతలోనే ఆ యువకుడు కూడా తనని తాను గాయపరుచుకున్నాడు.కాలనీ వాసులు కారు అద్దాలు పగులగొట్టి .. వారిద్దరి ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఇద్దరి ప్రాణాలకు హానీ లేదని పోలీసులు పేర్కొన్నారు.