Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ ప్ర‌క‌ట‌న‌లో తెలంగాణ‌తో కేసీఆర్ బంధం తెగిపోయింది: బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్

Hyderabad: టీఆర్ఎస్  విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా  ప్రకటించారు. టీఆర్ఎస్ ఇక నుండి బీఆర్ఎస్ గా మారుతుంద‌ని  పేర్కొంటూ ప్ర‌క‌ట‌న కూడా జారీ చేశారు. దీనిపై ప‌లు పార్టీల నాయ‌కుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.
 

Hyderabad : KCR's ties with Telangana severed in BRS announcement: BJP leader Eatala Rajender
Author
First Published Oct 5, 2022, 3:57 PM IST

Etala Rajender: గ‌త కొంత కాలంగా జాతీయ రాజ‌కీయాల్లోకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌వేశం గురించి భిన్న‌క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. ఎట్ట‌కేల‌కు ఆయ‌న జాతీయ పార్టీని ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) ను భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) గా మారుస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. టీఆర్ఎస్  విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా  ప్రకటించారు. టీఆర్ఎస్ ఇక నుండి బీఆర్ఎస్ గా మారుతుంద‌ని  పేర్కొంటూ ప్ర‌క‌ట‌న కూడా జారీ చేశారు. దీనిపై ప‌లు పార్టీల నాయ‌కుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. ఈక్ర‌మంలోనే భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయ‌కుడు, రాష్ట్ర మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్పందించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ ప్ర‌క‌ట‌న‌తో  తెలంగాణ‌కు కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయింద‌ని అన్నారు. 

టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా పేరు మారుస్తూ తీర్మానం చేయడాన్ని ఈటల రాజేందర్ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ ప్ర‌క‌ట‌న‌తో తెలంగాణకు కేసిఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని తెలిపారు. ఉద్యమ పార్టీని కతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించార‌ని విమ‌ర్శించారు. 

ఆ పార్టీ (బీఆర్ఎస్) స్థాపనతోనే తెలంగాణాకు కేసీఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. తెలంగాణా ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి క‌కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయింది :  బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్

కేసీఆర్ కొత్త పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న త‌ర్వాత ఆయ‌న న‌మ్ముకున్న‌ది మ‌ద్యాన్ని, డ‌బ్బును, ప్ర‌లోభాల‌ను అని ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయం చెలామణి చేయాలని పగటికల కంటున్నార‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అయితే, అది కలగా మిగిలిపోతుంద‌ని అన్నారు. ఏదిఏమైనా ఒక‌టి మాత్రం నిజం.. కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీయడానికి పోయినట్టు ఉందంటూ విమ‌ర్శించారు. తెలంగాణ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేని వాడు దేశ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఎలా తీర్చ‌గ‌ల‌ర‌ని ప్ర‌శ్నించారు. "తెలంగాణ‌లో ఉన్న సమస్యలు పరిష్కరించలేనివాడు.. అనేక రకాల ప్రజల విశ్వాసం కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు.. ఆ సంప్రదాయాన్ని ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు" అని ఈటల రాజేందర్ అన్నారు.

కాగా, టీఆర్ఎస్  విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్  జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా  ప్రకటించారు. టీఆర్ఎస్ ఇక నుండి బీఆర్ఎస్ గా మారనుంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడానికి తీసుకున్న తీర్మానం వివరాలను స్వయంగా కేసీఆర్ మీడియాకు చదివి వివరించారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios