Asianet News TeluguAsianet News Telugu

థియేటర్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూల్ చేస్తే ఇలా చేయండి..

ఎమ్మార్పీ ధరలకు మించి అమ్ముతున్నది ఒక్క ఐనాక్సే కాదు.. అన్ని థియేటర్లలోనూ ఇదే తంతు. మనం ప్రశ్నించకుండా అడిగినంతా ఇచ్చుకోవడంతోనే ఇలా థియేటర్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి.

Hyderabad inox fined for charging high amount for a water bottle

కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే మల్టీఫ్లెక్స్ కు క్యూ కట్టడానికి రెడీ అయిపోతాం. ఇంటర్వెల్ లో రూ. 10 ల పాప్ కార్న్ కు కూడా రూ.300 పెట్టడానికి వెనకాడం.ఎమ్మార్పీ ధరలంటే రెండు రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నా ఎప్పుడైనా ప్రశ్నించిమా.. స్మార్ట్ గా దోచుకునే ఇలాంటి నయా మోసగాళ్లను ఎదరురించామా...

 

ఏసీ థియేటర్ లో కూల్ గా సినిమా చూడటానికి వచ్చి ఎందుకు గొడవ అని సైలెంట్ అవుతాం తప్పితే ఎమ్మార్పీ ధరేంటీ నువ్వు చెబుతున్న రేటు ఏంటీ అని ఎప్పడూ వారిని నిలదీయం. అందుకే మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలు మరింతగా రెచ్చిపోతున్నాయి.

 

గత జూన్ లో విజయ్ గోయల్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని ఐనాక్స్ లో సినిమా చూడటానికి వెళ్లాడు. అతడు బయటనుంచి తెచ్చుకున్న వాటర్ బాటిల్ ను థియేటర్ లోకి అనుమతించలేదు.

 

దీంతో ఐనాక్స్ లోనే వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సి వచ్చింది. రూ. 20 ఎమ్మార్పీ ఉన్న వాటర్ బాటిల్ ను వాళ్లు రూ. 50 లకు అమ్మారు. దీనిపై ప్రశ్నిస్తే సరైన వివరణ కూడా ఐనాక్స్ సిబ్బంది ఇవ్వలేదు. దీంతో విజయ్ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు ను పరిగణలోకి తీసుకున్న ఫోరం ఐనాక్స్ యాజమాన్యానికి రూ. 5000 వేల జరిమానాతో పాటు, అదనంగా రూ. 50 లను బాధితుడికి అందించాలని ఆదేశించింది.

 

ఎమ్మార్పీ ధరలకు మించి అమ్ముతున్నది ఒక్క ఐనాక్సే కాదు.. అన్ని థియేటర్లలోనూ ఇదే తంతు. మనం ప్రశ్నించకుండా అడిగినంతా ఇచ్చుకోవడంతోనే ఇలా థియేటర్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. ఎమ్మార్పీ ధరలకు మించి డబ్బులు వసూలు చేసి గతంలో సర్వే రెస్టారెంట్ కూడా వినియోగదారుల ఫోరంతో చివాట్లు తిన్న విషయం తెలిసిందే.

 

Follow Us:
Download App:
  • android
  • ios