హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం: కోటి రూపాయ‌ల కొకైన్ స్వాధీనం, ముగ్గురు విదేశీయులు స‌హా ఏడుగురు అరెస్టు

Hyderabad Police: హైదరాబాద్ లో కోటి రూపాయ‌ల‌ విలువైన డ్రగ్స్ ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు హైదరాబాద్ లో ముగ్గురు విదేశీయులు సహా మొత్తం ఏడుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి 100 గ్రాముల కొకైన్, 300 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.
 

Hyderabad drug racket: Cocaine worth Rs 1 crore seized, 7 arrested, including 3 foreigners RMA

Drugs worth Rs 1 crore seized in Hyderabad:తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో మ‌రోసారి డ్ర‌గ్స్ (మాద‌క ద్ర‌వ్యాలు) క‌ల‌క‌లం రేపాయి. భారీగా కొకైన్ స‌హా ఇత‌ర డ్ర‌గ్స్ ను హైద‌రాబాద్ పోలీసులు ప‌ట్టుకున్నారు. న‌గ‌రంలో కోటి రూపాయ‌ల‌ విలువైన డ్రగ్స్ ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు హైదరాబాద్ లో ముగ్గురు విదేశీయులు సహా మొత్తం ఏడుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి 100 గ్రాముల కొకైన్, 300 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. బంజారాహిల్స్ సమీపంలో కోటి రూపాయ‌ల‌ విలువైన డ్రగ్స్ ను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు విదేశీయులతో సహా మొత్తం ఏడుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. వీరి వ‌ద్ద నుంచి 100 గ్రాముల కొకైన్, 300 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో నైజీరియాకు చెందిన అగ్బోవో మాక్స్ వెల్ (37), నైజీరియాకు చెందిన 32 ఏళ్ల ఓకే చిగోజీ బ్లెస్సింగ్ , నైజీరియాకు చెందిన 41 ఏళ్ల ఇకెమ్ ఆస్టిన్ ఒబాకా, హైదరాబాద్ కు చెందిన పి.సాయికేశ్ (25), కేరళలోని త్రిస్సూర్ కు చెందిన ఎం.సంజయ్ సునీల్ కుమార్ (27), హైదరాబాద్ కు చెందిన తుమ్మ భానుతేజరెడ్డి (23)లు ఉన్నారు.

వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. ఏడుగురు అనుమానితుల్లో ఒకరైన అగ్బోవో మాక్స్వెల్ 2011లో మెడికల్ వీసాపై ముంబ‌యికి వచ్చి కొంతకాలం తర్వాత బెంగళూరుకు మకాం మార్చాడు. అలాగే, 2012లో బిజినెస్ వీసాపై ముంబ‌యికి వచ్చి తమిళనాడులోని త్రిపురకు వెళ్లిన ఓకే చిగోజీ బ్లెస్సింగ్ 2022లో బెంగళూరుకు వచ్చి మాక్స్ వెల్ తో క‌లిసి వుంటున్నాడు. 2021లో ఐకెమ్ ఆస్టిన్ ఒబాకా జాన్ స్టూడెంట్ వీసాపై భారత్ కు వచ్చి బెంగళూరులో నివసించడం ప్రారంభించాడు. వీరు స్థానికుల‌తో క‌లిసి డ్ర‌గ్స్ దందాకు తెర‌లేపారు. విదేశీయులు నకిలీ పాస్ పోర్టులు, వీసాలను ఉపయోగించి కళాశాలలు, విశ్వవిద్యాలయాల సమీపంలో ఇళ్లు అద్దెకు తీసుకుని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని తమ కస్టమర్ బేస్ ను ఏర్పరుచుకున్నారని పోలీసులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios