హైద‌రాబాద్ నగ‌రంలోని జూబ్లీహిల్స్‌లో విషాదం నెల‌కొంది. ఓ డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. అయితే పరిస్థితి విషమించడంతో అతడు మృతిచెందాడు.

హైద‌రాబాద్ నగ‌రంలోని జూబ్లీహిల్స్‌లో విషాదం నెల‌కొంది. ఓ డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. అయితే పరిస్థితి విషమించడంతో అతడు మృతిచెందాడు. వివరాుల.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 7లో నివాసం ఉంటున్న డాక్ట‌ర్ మజారుద్దీన్ అనే వ్య‌క్తి ఈరోజు తుపాకీతో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేశాడు. అయితే ఇది గమనించిన అక్కడివారు గాయపడిన మజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మజారుద్దీన్ తుదిశ్వాస విడిచారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మజారుద్దీన్ ఆత్మహత్యకు సంబంధించి కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మజారుద్దీన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే కుటుంబ విభేదాల నేపథ్యంలోనే మజారుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, డాక్టర్ మజారుద్దీన్.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వియ్యంకుడని తెలుస్తోంది.