18 రకాల సైబర్ నేరాలను గుర్తించాం:హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్

సైబర్ నేరాలపై  అవగాహన కార్యక్రమాన్ని   బుధవారంనాడు  హైద్రాబాద్ లో  నిర్వహించారు.  సైబర్  నేరాల విషయంలో  అప్రమత్తంగా  ఉండాలని  హైద్రాబాద్ సీపీ   ఆనంద్ కోరారు. 

Hyderabad CP  CV  Anand  key Comments  In  Cyber  Cime  Awareness  Programme  lns

హైదరాబాద్:18 రకాల  సైబర్ నేరాలు  జరుగుతున్నట్టుగా  గుర్తించామని  హైద్రాబాద్ సీపీ  సీవీ ఆనంద్  చెప్పారు. సైబర్  నేరాలపై  పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక  సదస్సు  బుధవారంనాడు  హైద్రాబాద్ లో  జరిగింది.  ఈ సదస్సులో  తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి  మహమూద్ అలీ పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  హైద్రాబాద్ సీపీ  సీవీ ఆనంద్  ప్రారంభోపాన్యాసం  చేశారు. .  హద్దులు  లేని  స్నేహాలతో  కొన్నిసార్లు  ఇబ్బందులు  తప్పవన్నారు. పూర్తిగా తెలియని వాళ్లకు  కూడా  వ్యక్తిగత ఫోటోలు  పంపుతన్నారన్నారు.  
రుణాల పేరుతో  జరిగే  మోసాలు  ఎక్కువగా  ఉన్నాయని  సీవీ ఆనంద్  తెలిపారు. 

ప్రత్యక్ష యుద్ధాలు  పోయి  సైబర్ యుద్ధం నడుస్తుందన్నారు. మహేష్ బ్యాంక్  సర్వర్  హ్యాక్  నైజీరియా నుండి జరిగిన విషయాన్ని  సీవీ ఆనంద్ గుర్తు  చేశారు.  సైబర్ నేరాల  బారినపడకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని  సీపీ  సూచించారు. సైబర్ నేరాలు  50 శాతం  పెరిగాయన్నారు. డ్రగ్స్ వాడకందారులు  కూడా  బాగా పెరిగిపోయారని సీపీ  ఆందోళన  వ్యక్తం  చేశారు.కొంతమంది  విదేశీయులు  సైబర్ నేరాలకు  పాల్పడుతున్నారు.  చిన్న పిల్లలు  కూడా సెల్ ఫోన్లు  ఉపయోగిస్తున్నారన్నారు. సెల్ ఫోన్లు  లేకపోతే  ఆత్మహత్యలు చేసుకొనే  పరిస్థితి నెలకొందని  ఆయన  ఈ సందర్భంగా  ప్రస్తావించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios