రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ: రూ. 24.60 లక్షలకు దక్కించుకున్న లక్ష్మారెడ్డి

బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది.  బాలాపూర్ లడ్డూను రూ. 24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. 1994 నుండి బాలాపూర్ లడ్డూ వేలం పాట సాగుతుంది. లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బులను గ్రామ అభివృద్ది కోసం ఖర్చు చేస్తారు.

Hyderabad Balapur Ganesh Laddu Auction Rs 24.60 lakh

హైదరాబాద్: బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది.  వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24 లక్షల60 వేలలక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది 18.90 లక్షలకు లడ్డూను ఏపీ ఎమ్మెల్సీ రమేష్ అతని స్నేహితుడు శశాంక్ రెడ్డిలు లడ్డూను దక్కించుకున్నారు. 

గత ఏడాది కంటే ఈ ఏడాది వేలంలో రూ. 5 లక్షలు అదనంగా వేలం పాట పాడి వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.ఈ ఏడాది రూ. 1.11 లక్షలతో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. వేలం పాటలో పాల్గొన్న వారంతా లడ్డూను దక్కించుకొనేందుకు పోటీపడ్డారు. చివరికి రూ. 24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. చాలా ఏళ్లుగా ఈ లడ్డూ వేలంలో లక్ష్మారెడ్డి పాల్గొంటున్నారు. కానీ ఆయన గతంలో ఏనాడూ లడ్డూను దక్కించుకోలేదు. ఈ దఫా లడ్డూవేలం పాటలో పాల్గొన్నారు. 

also read:వందల నుండి లక్షలకు చేరిన వేలం: బాలాపూర్ లడ్డూ వేలం చరిత్ర ఇదీ

ఈ వేలం పాటలో పాల్గొనాలంటే తొలుత రూ. 500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే స్థానికేతరులు ఈ లడ్డూ వేలం పాటలో పాల్గొనాలంటే గత ఏడాది లడ్డూ వేలం పాట ధరను ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బాలాపూర్ గ్రామానికి లడ్డూ వేలం పాటతో పెద్ద ఎత్తున క్రేజ్ వచ్చింది. పోటీలు పడి లడ్డూ వేలం పాటలో పాల్గొంటారు. ఈ లడ్డూను దక్కించుకొన్నవారికి ఆ ఏడాది అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయనే నమ్మకం. దీంతో ప్రతి ఏటా ఈ లడ్డూ వేలంలో పాల్గొనేందుకు పోటీలు పడుతారు. స్థానికులను కాదని ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున ఈ వేలం పాటలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు.

 

బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న వారు ఈ లడ్డూను తమ కుటుంబ సభ్యులు బంధువులకు పంచిపెడతారు. తమ వ్యవసాయ పొలాల్లో కూడా ఈ లడ్డూను చల్లుతారు. దీంతో పంటల దిగుబడి ఎక్కువగా వస్తుందనే స్థానికుల నమ్మకం. ఈ గ్రామానికి చెందిన కొలను కుటుంభీకులు ఎక్కువగా ఈ లడ్డూను దక్కించుకున్నారు.  కొలను కుటుంభీకులను కాదని ఇతరులు కూడా ఈ లడ్డూను దక్కించుకొనేందుకు పోటీలు పడ్డారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios