Asianet News TeluguAsianet News Telugu

మీ టోపీలు తీసి మాకు పెడతారా..

క్రైం రేటు తగ్గిందని మీడియా సమావేశంలో ఇలా కమిషనర్ ప్రకటించారో లేదో దొంగలకు పట్టరాని కోపం వచ్చేసినట్లుంది. అలా సిటీలోని బీరాంగూడలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కు వెళ్లి  ఓ 50 కేజీల బంగారాన్ని పట్టపగలే దోచుకొని క్రైం రేటు పెరుగుదలకు తమ వంతు సహకారాన్ని అందజేశారు.

hyd cp claim crime graph down but reality is different

 

దేశం క్యాష్ లెస్ కంట్రీగా మారుతుందో లేదో తెలియదు కానీ, హైదరాబాద్ నగరం మాత్రం త్వరలోనే క్రైం లెస్ సిటీగా మాత్రం మారుతుంది. సాక్షాత్తు సిటీ పోలీసు కమిషనరే క్యాపు పెట్టుకొని మరీ ఈ విషయం చెబుతున్నాడు. అందుకు సాక్ష్యంగా లెక్కలు కూడా చూపిస్తున్నారు.

 

గత ఏడాది తో పోల్చి చూస్తే సిటీలో క్రైం రేటు   బాగా... బాగా.. తగ్గిందట. దోపిడీలు, అత్యాచారాలైతే  పూర్తిగా తగ్గుముఖం పట్టాయట. ఈ ఏడాది 17,403 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. గత ఏడాదితో పోల్చిచూస్తే  క్రైం రేటు 31 శాతం తక్కువగా నమోదైందన్నారు.

 

మీడియా సమావేశంలో ఇలా కమిషనర్ ప్రకటించారో లేదో దొంగలకు వెంటనే కోపం వచ్చేసినట్లుంది. అలా సిటీలోని బీరాంగూడలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కు వెళ్లి  ఓ 50 కేజీల బంగారాన్ని పట్టపగలే దోచుకొని క్రైం రేటు పెరుగుదలకు తమ వంతు సహకారాన్ని అందజేశారు.

 

ఇక అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో క్రైం రేటు గతేడాదితో పోల్చితే తగ్గిందని సిటీ కమిషనర్ అంటుంటే ఎక్కడో తేడా మాత్రం కొడుతోంది.


గత 11 ఏళ్ల నుంచి చూస్తే దోపిడీలు ఈ ఏడాదే అత్యధికంగా నమోదయ్యాయి.  2016 ముగింపునకు వచ్చేసరికి సిటీలో దోపిడీల సంఖ్య 18 గా నమోదైంది.

 

ఇక అత్యాచారాల విషయానికి వస్తే ఈ ఏడాది దీనికి సంబంధించి 161 కేసులు నమోదయ్యాయి. గతేడాది 115 కేసులో నమోదయ్యాయి. కానీ, సీపీ మాత్రం ఈ ఏడాది క్రైం రేటు బాగా తగ్గిందనడం గమనార్హం.

 

మరోవైపు ఈ ఏడాది  వివిధ నేరాలలో పోలీసుల ప్రమేయం కూడా బాగానే పెరిగింది. నయాం కేసు తో సహా  నోట్ల రద్దు వరకు చాలా కేసులలో పోలీసుల హస్తం ఉన్నట్లు రుజువైంది. దీనిపై సీపీ మాట్లాడుతూ.. ఇలాంటి కేసుల్లో ప్రమేయం ఉన్న పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

 

మరో వైపు సిటీలో గన్ కల్చర్ కూడా బాగానే పెరిగింది. రోజు ఎక్కడో ఒక చోట కాల్పుల కలకలం వినిపిస్తూనే ఉంది. 

 

బహుశా ఇవన్నీ క్రైం  కిందకు రావనుకుంటా... అయినా పోలీసుల లెక్కలు, పొలిటీషిన్ల లెక్కలు సామాన్యులకు అంతుపట్టవు.. వాటిని గుడ్డిగా నమ్మాల్సిందే.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios