Huzurabad Bypoll: కుట్రలకు తెరతీసి... ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ఈటల: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హుజురాాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడేకొద్ది బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కుట్ర, సానుభూతి రాజకీయాలకు తెరతీస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బాలరాజు ఆరోపించారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడటంతో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు ఆరోపించారు. ఈటల ఆత్మహత్య లు చేసుకునేవిధంగా ప్రేరేపిస్తున్నారని... అయితే ఏ ఒక్కరు చనిపోయినా, ఆత్మహత్యకి పూనుకున్న ఇక్కడి ప్రజలు సహించరని ఎమ్మెల్యే బాలరాజు హెచ్చరించారు.
huzurabad bypoll గురించి మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు balka suman, guvvala balaraju మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ... టాలీవుడ్ కాదు బాలీహుడ్, హాలీవుడ్ నటుల స్థాయిలో బీజేపీ వాళ్ళు నటిస్తున్నారని ఎద్దేవా చేసారు. కుట్ర రాజకీయాలు చేస్తున్న BJP పట్ల మరో 10రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సుమన్ సూచించారు.
''బీజేపీ పువ్వు కాంగ్రెస్ చెయ్యిలో కలిసిపోయింది. TPCC అధ్యక్షుడు revanth reddy ఆ పార్టీ అభ్యర్థి balmoor venkat ని బలి చేశారు. ముందునుండి ఈటలను గెలిపించాలనే రేవంత్ చూస్తున్నారు. దీన్నిబట్టే బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయాయని అర్థమవుతుంది. రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాయి'' అని సుమన్ మండిపడ్డారు.
read more హుజూరాబాద్‌లో మూడోసారి ఉపఎన్నిక: రెండు ఎన్నికల్లో గులాబీ జయకేతనం, ఈ దఫా విజయం ఎవరిది?
ఇక మరో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ... హుజురాబాద్ ఉప ఎన్నిక TRS Government ని కూల్చే ఎన్నిక ఏమాత్రం కాదన్నారు. ఈటల సానుభూతి రాజకీయాలకు తెరలేపుతున్నారని అన్నారు. ఆత్మహత్యలను ప్రేరేపించి దానిద్వారా లబ్ది పొందాలని ఈటల చూస్తున్నాడని ఆరోపించారు. ఈటలకి మతిభ్రమించి మెదడు మోకాళ్ళలోకి వచ్చింది... అందుకే ఆపరేషన్ చేసుకున్నట్లు డ్రామా చేశారని బాలరాజు మండిపడ్డారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయినప్పటికి ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ వందకు వంద శాతం విజయం సాధిస్తుందని స్పష్టం చేసారు. నాగార్జున సాగర్ లో జానా రెడ్డినే ఓడించాం... ఈటల రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా? అన్నారు. eatala rajender బీజేపీ బురదను అంటించుకున్నారని పేర్కొన్నారు. BJP ని ఈటల... ఈటలను బీజేపీ సొంతం చేసుకోవడం లేదన్నారు. జై ఈటల అంటున్నారు తప్ప జై శ్రీరామ్ అని ఎందుకనడం లేదు...Huzurabad bypoll లో బీజేపీ అంటే ఓట్లు పడవనే ఈటల ఆ పార్టీ పేరు ఎత్తడం లేదన్నారు.
read more దళిత బంధు కొనసాగుతుంది.. ఏది మొదలుపెట్టినా సాధించి చూపించాం: సీఎం కేసీఆర్
''ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ ఎంతో చేసింది. అలాంటి పార్టీకి రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పడం లేదు. గెలిస్తే ఏం చేస్తాడో చెప్పక వేరే విషయాలు మాట్లాడుతున్నాడు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి. ఈటల, రేవంత్ కుమ్మక్కయ్యారు. అందుకోసమే బలమైన అభ్యర్థిని కావాలనే కాంగ్రెస్ బరిలోకి దింపలేదు'' అని కేటీఆర్ ఆరోపించారు.