హుజూరాబాద్‌లో మూడోసారి ఉపఎన్నిక: రెండు ఎన్నికల్లో గులాబీ జయకేతనం, ఈ దఫా విజయం ఎవరిది?
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి మూడో దఫా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.గతంలో రెండు దఫాలు టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ దఫా విజయం ఎవరిని వరిస్తోందోనేది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
హైదరాబాద్: Huzurabad అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు రెండు దఫాలు ఉప ఎన్నికలు జరిగాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో మూడో దఫా ఉప ఎన్నికలు జరగనున్నాయి.2008, 2010లలో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కేసీఆర్ మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను భర్తరఫ్ చేశాడు.దీంతో ఈ ఏడాది జూన్ 12న హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు.దీంతో ఈ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నికలు జరగనున్నాయి.
also read:దళిత బంధు కొనసాగుతుంది.. ఏది మొదలుపెట్టినా సాధించి చూపించాం: సీఎం కేసీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఉప ఎన్నికలు జరిగాయి. 2004లో ఈ స్థానం నుండి Trsఅభ్యర్ధిగా పోటీ చేసిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఆ ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కెప్టెన్ లక్ష్మీకాంతారావు విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఈటల రాజేందర్ 2018 వరకుటీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఈటల రాజేందర్ విజయం సాధించారు.
ఈ ఏడాది జూన్ 12వ తేదీన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈటల రాజేందర్ ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.ఇప్పటివరకు జరిగిన రెండు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. మూడో దఫా ఈ స్థానం నుండి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈ ఉప ఎన్నికలో ఏ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తారనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రెండు ఉప ఎన్నికలు కూడా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే జరిగాయి. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని విన్పించేందుకు రాజీనామాలను టీఆర్ఎస్ అస్త్రంగా ఉపయోగించుకొంది. Telangana రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఉప ఎన్నిక జరుగుతుంది. గత ఎన్నికలకు ఈ ఎన్నికకు మధ్య తేడా ఉంది.
ఈ స్థానాన్ని దక్కించుకొనేందుకు Bjp, టీఆర్ఎస్ లు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఈ స్థానంలో ప్రజలు ఎవరికీ పట్టం కడుతారనే విషయమై వచ్చే నెల 2న తేలనుంది.ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగాEtela Rajender టీఆర్ఎస్ అభ్యర్ధిగా Gellu Srinivas Yadav, కాంగ్రెస్ అభ్యర్ధిగా Balumuri Venkat బరిలో నిలిచిన విషయం తెలిసిందే.