దళిత బంధు కొనసాగుతుంది.. ఏది మొదలుపెట్టినా సాధించి చూపించాం: సీఎం కేసీఆర్
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళిత బంధు పథకంపై చర్చ జరిగింది. ఈ పథకాన్ని ఎన్నికల కమిషన్ నిలిపేయడంతో పథకం భవితపై ప్రశ్నలు వచ్చాయి. కానీ, దళిత బంధు పథకంపై ఆందోళన వద్దని, ఉపఎన్నిక తర్వాత దాన్ని యధావిధిగా నిర్వహించి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తాను ఏది మొదలుపెట్టినా సాధించి తీరానని వివరించారు. దళిత బంధుపైనా ఎలాంటి సంశయాలు వద్దని అన్నారు.
హైదరాబాద్: యాదాద్రి ఆలయ పున:ప్రారంభ ముహూర్తం తేదీని ఖరారు చేసిన Telangana CM KCR అదే సమావేశంలో మరో కీలక విషయంపై స్పష్టత ఇచ్చారు. Huzurabad Bypoll సందర్భంగా దళిత బంధు స్కీమ్‌పై Election Commission ప్రతికూల నిర్ణయం తీసుకున్నది కదా? అని అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ స్పందించారు. వారు తమ పరిధి దాటినట్టు కనిపిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అది అమలవుతున్న scheme అని, దాన్ని ఆపడం సరికాదని తెలిపారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. గతంలో నేను ఏది చెప్పినా దాన్ని ఏ విధంగా సాధించి చూపెట్టినో అందరికీ తెలుసు అని అన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం కావొచ్చు లేదా ఈ రాష్ట్రంలోని అందరు Dalit బిడ్డలకు నేను చెప్పేది ఒకటే.. నా మెస్సేజ్ ఒకటే.. నేను ఏది చేపట్టినా దాన్ని విజయ తీరాలకు చేర్చినా.. అంతే తప్పా వెనక్కి పోలేదు అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంచి చెడ్డు విచారించే నేను చేస్తున్నా అని అన్నారు. ఈ సందర్భంగా ఓ తెలంగాణ సామెతనూ ఉటంకించారు. తొండ బిర్రు ఏడిదాకా అంటే ఎనుగుల దాకా అన్నట్టు.. ఎన్నికల కమిషన్ ఎన్ని రోజులు ఆపగలుగుతుంది అని అన్నారు.
Also Read: Huzurabad Bypoll: మళ్ళీ దగాపడ్డ దళితులు... సీఎం కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే: బండి సంజయ్ డిమాండ్
30న పోలింగ్ అయిపోతుందని, నవంబర్ 2న ఫలితాలు వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. నవంబర్ 4న నేను వెళ్లి అందరికీ పంపిణీ చేస్తా.. ఎవ్వరూ చింత పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై చిన్నబుచ్చుకోవాల్సిన పనీ లేదని వివరించారు. ఆ కార్యక్రమం ఇప్పటికే మొదలుపెట్టామని, జరుగుతూ ఉన్నదని, ఇకపైనా అది నిర్విగ్నంగా జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ సృష్టించింది చాలా చిన్న ఆటంకమని, దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదని వివరించారు.
హుజురాబాద్ లో ఎన్నిక ముగిసేవరకు దళిత బంధును నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలతో రాజకీయాలు ఒక్కసారగా వేడెక్కాయి. ఇందుకు మీరంటే మీరని రాష్ట్రంలో అధికారంలో వున్న TRS, కేంద్రంలో అధికారంలో వున్న BJP ఆరోపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బిజెపి ఉపాధ్యక్షులు విజయ రామారావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ పద్మనాభ రెడ్డితో దళిత బంధుపై పిర్యాదు చేయించింది టీఆర్ఎస్ పార్టీయే అంటూ vijaya ramarao సంచలన వ్యాఖ్యలు చేసారు.
'ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి dalit bandhu అమలు చేసే పరిస్థితిలో వుంది. కానీ huzurabad Bypoll లో తన పార్టీ TRS ను గెలిపించుకోవాలంటే దళితుల ఓట్లు కావాలి. అందుకోసమే దళిత బంధును తానే ప్రారంభించి తిరిగి తానే ఆగిపోయేలా చేసారు. కేసీఆర్ దళిత బంధు అపిస్తాడని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు తెలుసు'' అని విజయ రామారావు ఆరోపించారు.