Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll: అరే బిడ్డా... నీతో కాదు నీ జేజెమ్మతో కూడా కొట్లాడుతా: కేసీఆర్ పై ఈటల ఫైర్

హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా వీణవంకలో ప్రచారం నిర్వహించిన బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. 

huzurabad bypoll... eatala rajender fires on kcr in election campaign at veenavanka
Author
Huzurabad, First Published Oct 20, 2021, 2:43 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ మాటల యుద్దం మరింత ముదురుతోంది. బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు పరస్పరం తూటాల్లాంటి మాటలతో దాడులు చేసుకుంటున్నారు. తాజాగా వీణవంక మండలం కిష్టంపేటలో మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

''నేను ఏకుమేకై ఎక్కడ ముఖ్యమంత్రి అవుతానో అని భయపడే KCR పార్టీలోంచి బయటకు పంపాడు. ఇప్పుడు నా ముఖం కూడా TS Assembly లో కనిపించకూడదని చూస్తున్నాడు. అయితే రేపు ఎవరి ముఖం అసెంబ్లీలో కనిపించదో చూద్దాం... నేను గెలిచి అసెంబ్లీకి పోతే ఆయన(కేసీఆర్) మాత్రం పక్కా ఉండడు. ఎందుకంటే నా ముఖం చూడడం ఆయనకు ఇష్టంలేదు'' అని eatala rajender అన్నారు.  

''నర్సింగాపూర్ లో నా భార్య eatala jamuna ప్రచారం చేసి ఒకరింట్లో కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తుంటే నీడ కోసం వేసుకున్న టెంట్ పీకేసారట. కనీసం తినేదాకా ఆగమన్నా ఆగకుండా టెంట్ తీసేసిన మూర్ఖులు వీళ్లు. ఇలాంటి చిల్లరపనులు చేస్తే ఓట్లు పడతాయా?'' అని నిలదీసారు. 

''అరే బిడ్డా... ఈ నెల 30 తారీఖు తర్వాత కేసీఆర్ కాదు.. ఆయన జేజెమ్మతో అయినా కొట్లాడతా. ఎప్పుడూ మేము కొట్లాట పట్టుకోలేదు కానీ వారే చిల్లరపనులు చేస్తూ రెచ్చగొడుతున్నారు. నాకు కొట్లాడే శక్తినీయండి. ఎవరి మాటలు నమ్మకుండా పోలింగ్ రోజు నిండు మనస్సుతో ఆశీర్వదించండి'' అని ఈటల కోరారు. 

read more  హుజూరాబాద్‌లో మూడోసారి ఉపఎన్నిక: రెండు ఎన్నికల్లో గులాబీ జయకేతనం, ఈ దఫా విజయం ఎవరిది?

''పద్దెనిమిదిన్నర ఏళ్లపాటు TRS పార్టీలో వుంటే నన్ను మధ్యలో వచ్చారంటున్నారు. నేనేమైనా సబితా ఇంద్రారెడ్డిలాగా, ఎర్రబెల్లిలాగా మధ్యలో వచ్చానా? టీఆర్ఎస్ లో వుండగా నాకు ఏ బాధ్యత ఇచ్చినా సమర్ధవంతంగా నిర్వహించాను. ఒక్కసారి సద్దితింటేనే తల్చుకుంటారు. అలాంటిది వేలసార్లు కేసీఆర్ తో అన్నం తిన్నాను'' అని ఈటల పేర్కొన్నారు. 

''ఉద్యమ సమయంలో కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు.. ఇప్పుడు వదిలేసాడు. నేను మీకు చేసిన మేలును మరిచిపోయి తాత్కాలిక ప్రయోజనాల కోసం నన్ను ఓడించే ప్రయత్నం చేస్తారా? హుజుర్ నగర్, నాగార్జున సాగర్ లాంటి చోట్ల మీరు మోసం చేయవచ్చు... కానీ హుజురాబాద్ లో మీకు సాధ్యం కాదు. ప్రేమకు లొంగే ఈ ప్రజలు అవసరమైతే బరిగీసి కొట్లాడుతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ల గ్రాఫ్ పెరగడం లేదని.. బ్రహ్మాస్త్రం లాగా ఓటుకు రూ.20 వేలు ఇస్తారట'' అని ఈటల ఆరోపించారు.

''దళితుల మీద ప్రేమతో dalit bandhu పెట్టలేదు. ఈ విషయం నిద్రపోయే ముందు ఆలోచించండి. దళితులపై నిజమైన ప్రేమ కేసీఆర్ కు ఉంటే తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న మాట నిలబెట్టుకునేవాడు. కాపలా కుక్కలాగా ఉంటానని చెప్పి మనల్ని కాపలా కుక్కల్లాగా మార్చాడు. ఆయన ఇంట్లో ఐదుగురికి పదవులిచ్చుకుని మనల్ని బానిసలుగా మార్చాడు'' అన్నారు.

read more  Huzurabad Bypoll: ఈటలతో కలిసి కాంగ్రెస్ లోకి జంప్... కేటీఆర్ వ్యాఖ్యలపై వివేక్ క్లారిటీ

''మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ఇచ్చాడా? ఇవాళ పదేసి లక్షలు ఇస్తున్నాడు...కానీ కేవలం హుజురాబాద్ కే ఎందుకిస్తున్నాడో ఆలోచించండి. 46 వేల దళితుల ఓట్లపై కన్నేసి పదిలక్షలు ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆ చెక్కు చెల్లలేదు. నిన్ననేను దొంగ ఉత్తరం రాసి ఆపినట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ నిన్న ఓ లెటర్ పంపాను. సీఎం కేసీఆర్... నీకు దమ్ముంటే కలెక్టర్ల పెత్తనం లేకుండా పదిలక్షలు ఇవ్వు'' అని ఈటల పేర్కొన్నారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios