Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll: ఈటలతో కలిసి కాంగ్రెస్ లోకి జంప్... కేటీఆర్ వ్యాఖ్యలపై వివేక్ క్లారిటీ

హుజురాబాద్ లో బిజెపి తరపున పోటీచేస్తున్న ఈటల రాజేందర్ సహాా మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్ లో చేరనున్నారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై స్పందించారు వివేక్, 

huzurabad bypoll: ex mp vivek  reacts on ktr comments on party changing
Author
Huzurabad, First Published Oct 19, 2021, 4:34 PM IST

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత బిజెపి నాయకులు ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరనున్నారంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అందుకోసమే ఈటల విజయానికి కాంగ్రెస్ సహకరిస్తుందన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత ఈటల, వివేక్ లను కాంగ్రెస్ నేతలు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తారని... ఆ ఆహ్వానాన్ని మన్నించి వారు కాంగ్రెస్ లో చేరతారని కేటీఆర్ తెలిపారు. పక్కా సమాచారంతో ఈ విషయం బయటపెడుతున్నానని కేటీఆర్ వెల్లడించారు. 

KTR వ్యాఖ్యలు BJPతో పాటు eatala rajender, vivek venkatswamy లను ఇరకాటంలో పెట్టాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన వివేక్ పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తాము Congress లో చేరబోమని... బిజెపి బలోపేతానికే ఎల్లపుడూ పని చేస్తామన్నారు. రాజకీయాల కోసమే తాము పార్టీ మారనున్నట్లు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివేక్ తెలిపారు. 

''దళితులనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేస్తానని అనడంతో పాటు అధికారంలోకి వచ్చాక భూమి లేని నిరుపేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే మరెన్నో హామీలు కూడా దళితులకు ఇచ్చారు. కానీ అవేవీ అమలుకాలేదు. కానీ ఈ ఏడు సంవత్సరాల ఆయన పాలన అప్పుల పాలనగా మారింది'' అని ఎద్దేవా చేసారు.

read more  Huzurabad Bypoll: దళిత బంధుపై ఆయనతో పిర్యాదు చేయించిందే టీఆర్ఎస్..: విజయ రామారావు సంచలనం

''దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఆనాడే ఇస్తే ఇప్పుడు దాని విలువ ఎంత తక్కువ అనుకున్నా రూ.60 లక్షలు అయ్యేది. అలాంటిది అది అమలుచేయకుండా ఇప్పుడు ఎన్నికల కోసం రూ.10లక్షలు ఇస్తానంటున్నారు. అది కూడా ఎన్నికల సమయంలో అమలుచేస్తామంటున్నారు. ఈసీ ఎలాగూ అడ్డుకుంటుంది కాబట్టే ఈ పథకాన్ని హుజురాబాద్ లో ప్రారంభించారు'' అని వివేక్ పేర్కొన్నారు. 

''అధికారంలోకి వచ్చి ఏళ్లు గడిచినా ముఖ్యమంత్రి కార్యాలయంలో కనీసం ఒక్క దళిత అధికారిని నియమించలేదు. గత నాలుగు నెలల నుండి దళిత బంధు డబ్బులు రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు  ఇవ్వాలని కోరింది బిజెపి పార్టీ. దళిత బంధు డబ్బులు అకౌంట్ లలో వేసామని చెప్పుకుంటూ విత్ డ్రా చేసుకోకుండా ఫ్రిజ్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం'' అని మండిపడ్డారు.

''హుజురాబాద్ ఉపఎన్నికలో బిజెపిని భారీ మెజారిటీతో దళితులు గెలిపిస్తారు. టీఆర్ఎస్ ఎక్కడ ఓడిపోతుందో అక్కగ కేటీఆర్ ఉండడు. హుజురాబాద్ లో కూడా తాను ప్రచారం చేయను అంటున్నాడు. దీన్ని బట్టే ఇక్కడ కూడా బిజెపి గెలుస్తుందని కేటీఆర్ కు తెలుసు'' అన్నారు. 

read more  Huzurabad Bypoll: మళ్ళీ దగాపడ్డ దళితులు... సీఎం కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే: బండి సంజయ్ డిమాండ్

''ఈటల రాజేందర్ , హరీష్ రావు మంచి స్నేహితులు. ఈ ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిందే కేటిఆర్. ఇప్పుడు ఓటమి భయంతో ఏదో ఒకటి చెప్పాలని కేటిఆర్ మాట్లాడుతున్నాడు. మేము కాంగ్రెస్ లోకి పోతామంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టాడు'' అని మాజీ ఎంపీ వివేక్ వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios