Huzurabad Bypoll: ఈటల కు షాక్... మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి బిజెపి శ్రేణులు (వీడియో)
హుజురాబాద్ ఉపఎన్నికలో బిజెపి బలహీనపర్చి ఈటల రాజేందర్ గెెలుపు అవకాశాలను దెబ్బతీయాలన్న పకడ్బందీ వ్యూహంతో మంత్రి హరీష్ రావు ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే బిజెపికి చెందిన కిందిస్థాయి నాయకులను సైతం స్వయంగా తానే టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకువెళుతోంది. ఓ వైపు ప్రచారంలో ప్రత్యర్థి బిజెపిపై విరుచుకుపడుతూనే మరోవైపు ఆ పార్టీని బలహీనపర్చే పనిలో పడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హుజూరాబాద్ పట్టణానికి చెందిన పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అలాగే పలువురు సిపిఐ నాయకులు కూడా మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా harish rao మాట్లాడుతూ... ఎంతో నిబద్దత కలిగివుండే CPI కార్యకర్తలు కూడా TRS లో చేరుతుండటమే తమ పనితనానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి KCR అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం దళిత బందు పథకం తీసుకువచ్చారని అన్నారు. సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.
వీడియో
''ధరలు పెంచిన బిజెపిని దేశ ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు. BJP పాలిత కర్ణాటక ప్రజాప్రతినిధులు తెలంగాణలో సాగుతున్న సంక్షేమ పాలన చూసి ఆశ్చర్యపోతున్నారు. అందువల్లే తమ ప్రాంతాన్ని కూడా Telangana లో కలపాలని కోరుకుంటున్నారు. హుజురాబాద్ ప్రచారానికి వచ్చేముందు తెలంగాణ బిజెపి ప్రజా ప్రతినిధులు పక్కరాష్ట్రం రాయచూర్ కు చెందిన తమ పార్టీ నాయకుడి మాటలు ఓసారి వినాలి'' అని ఈటల సూచించారు.
read more Huzurabad ByPoll: ఈటలకు హరీశ్ రావు సవాల్... రుజువు చేస్తే రాజీనామా చేస్తా: ప్లేస్, టైం డిసైడ్ చేయ్
''ఇక కేంద్రంలో అధికారంలో వున్నబిజెపి పార్టీ Gas cylinder ధరలను భారీగా పెచిందని నేను అన్నారు. కానీ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం గ్యాస్ సిలిండర్ పై రాష్ట్ర పన్నులే రూ.291 వున్నాయని అంటున్నారు. ఈ విషయాన్ని eatala rajender నిరూపిస్తే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ముక్కు నేలకు రాస్తాను'' అని మంత్రి హరీష్ సవాల్ విసిరారు.
అంతకుముందు పెంచికల్ పేటలో ప్రచారం నిర్వహించిన హరీశ్ రావు గ్యాస్ సిలిండర్ ధర పెంపులో టీఆర్ఎస్ ప్రభుత్వం వాటానే ఎక్కువన్న బిజెపి వ్యాఖ్యలపై స్పందించారు. gas price లో రూ.291 రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానన హరీశ్ తెలిపారు. రుజువు చేయలేకపోతే ఎన్నికల నుంచి రాజేందర్ తప్పుకుంటారా అని మంత్రి సవాల్ చేశారు. ప్లేస్, టైం డిసైడ్ చేసే ఛాన్స్ కూడా ఈటలకే ఇస్తున్నానని హరీష్ అన్నారు.
గ్యాస్ ధర తగ్గాలంటే రాష్ట్రం పన్నులు తగ్గించుకోవాలని ఈటల అంటున్నారని...కానీ గ్యాస్ సిలిండర్ పై రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ వేయడంలేదని హరీష్ స్పష్టం చేసారు. జీఎస్టీ లో కేవలం 5 శాతం మాత్రమే రాష్ట్ర వాటా ఉందని.. అది కూడా రూ.47 రూపాయలు మాత్రమేనని ఆర్థికమంత్రి హరీష్ వెల్లడించారు.
read more Huzurabad Bypoll: టీఆర్ఎస్ కు కరోనా షాక్... మంత్రి గంగులకు పాజిటివ్
ఇదిలావుంటే అక్టోబర్ 1వ తేదీన హుజురాబాద్ election notification విడుదలై నామినేషన్ల స్వీకరణ ప్రారంభయిన నాటినుండి టీఆర్ఎస్ ప్రచారం జోరు మరింత పెరిగింది.కానీ తాజాగా మంత్రి gangula kamalakar కరోనా బారినపడి ప్రచారానికి దూరమయ్యారు. దీంతో అంతా తానై టీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు హరీష్ రావు.
హుజురాబాద్ ఉపఎన్నిక కోసం అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరణ జరగ్గా అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించారు. ఇక అక్టోబర్ 13వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు వుండగా... అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న counting నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.