Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll: టీఆర్ఎస్ కు కరోనా షాక్... మంత్రి గంగులకు పాజిటివ్

హుజురాబాద్ పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న సమయంలోో అధికార టీఆర్ఎస్ కు కరోనా షాకిచ్చింది. ఆ పార్టీ తరపున ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి గంగుల కరోనా బారిన పడ్డారు. 

huzursbad bypoll:  Gangula Kamalakar Tested Corona Positive
Author
Huzurabad, First Published Oct 13, 2021, 9:17 AM IST

కరీంనగర్: అత్యంత కీలకమైన హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో అధికార టీఆర్ఎస్ కు కరోనా షాకిచ్చింది. ఈ huzurabad bypoll లో  TRS ను గెలిపించుకునేందుకు ముమ్మర ప్రచారం చేస్తున్న కీలక సమయంలో కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఇక హుజురాబాద్ ప్రచారానికి దూరం కానున్నారు.

హుజురాబాద్ లో మకాం వేసిన మంత్రి గంగుల టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా ఆయన జలుబు, జ్వరంతో బాధ పడుతున్నారు. దీంతో ఆయన కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

అయితే ప్రస్తుతం గంగుల ఆరోగ్యం నిలకడగానే ఉందని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కానీ ఇటీవల హుజురాబాద్ ప్రచారంలో మంత్రితో కలిసి పాల్గొన్నవారు, ఇటీవల ఆయనను వ్యక్తిగతంగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని... అవసరమైతే హోం క్వారంటైన్ లోనే ఉండాలని సూచించారు.

read more  Huzurabad ByPoll: ఈటల‌కు హరీశ్ రావు సవాల్... రుజువు చేస్తే రాజీనామా చేస్తా: ప్లేస్, టైం డిసైడ్ చేయ్

మంత్రివర్గం నుండి eatala rajender ను బర్తరఫ్ చేసిన తర్వాత karimnagar జిల్లా టీఆర్ఎస్ బాధ్యతలు మంత్రి gangula kamalakar హస్తగతమయ్యాయి. ఇక ఈటల టీఆర్ఎస్ పార్టీని వీడుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిమరీ bjpలో చేరడంతో జిల్లా టీఆర్ఎస్ లో గంగులనే కీలక నాయకుడయ్యారు. ఇక హుజురాబాద్ లో టీఆర్ఎస్ ను గెలిపించే బాధ్యత కూడా ఆయనపై పడింది.

ఈ నేపథ్యంలో మంత్రి గంగుల హుజురాబాద్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజానెత్తుకున్నారు. ఈటల  వెంట బిజెపిలోకి వెళ్లిన నాయకులను తిరిగి టీఆర్ఎస్ లోకి తీసుకురావడం, ఇతర పార్టీల నాయకులను కూడా చేర్చుకుని పార్టీని మరింత బలోపేతం చేయడంతో కీలకంగా వ్యవహరించారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎంపిక తర్వాత ఆయనతో కలిసి ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు గంగుల. 

ఈ క్రమంలో ఆయన కరోనా బారినపడటం టీఆర్ఎస్ పార్టీకి లోటేనని చెప్పాలి. ప్రస్తుతం హోంక్వారంటైన్ లోకి వెళ్లిన ఎన్నికలు ముగిసేవరకు బయటకు వచ్చే అవకాశాలు లేవు. దీంతో హుజురాబాద్ లో ఇక ఆయన ప్రచారం లేనట్లే. అయితే పార్టీ నాయకులతో టచ్ లో వుంటూ ప్రచారాన్ని ముందుకు నడిపించే అవకాశాలున్నాయి. 

read more  Huzurabad Bypoll: ఈటల రాజేందర్, బీజేపీకి టీఆర్ఎస్ షాక్.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

అయితే గంగుల హుజురాబాద్ ప్రచారానికి దూరమైన టీఆర్ఎస్  ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు మాత్రం ప్రచారంలోనే వున్నారు.బిజెపి పార్టీ, ఈటల రాజేందర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఆయన ప్రచారం సాగుతోంది. అభ్యర్థి గెల్లును వెంటపెట్టుకుని హుజురాబాద్ నియోజకవర్గం మొత్తాన్ని హరీష్ చుట్టేస్తున్నారు.

అక్టోబర్ 1వ తేదీన హుజురాబాద్  election notification విడుదలై నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యింది.  అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించగా అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించారు. ఇక అక్టోబర్ 13వరకు  నామినేషన్ల ఉపసంహరణకు గుడువు వుండగా... అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న  counting నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios