Huzurabad ByPoll: ఈటల‌కు హరీశ్ రావు సవాల్... రుజువు చేస్తే రాజీనామా చేస్తా: ప్లేస్, టైం డిసైడ్ చేయ్

బీజేపీ (bjp) అభ్యర్థి ఈటల రాజేందర్‌కు (etela rajender) ఆయన సవాల్ విసిరారు. గ్యాస్ సిలిండర్ (gas price) ధరలో రూ.291 రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానన హరీశ్ తెలిపారు. రుజువు చేయలేకపోతే ఎన్నికల నుంచి రాజేందర్ తప్పుకుంటారా అని మంత్రి సవాల్ చేశారు.

huzurabad bypoll minister harishrao challenges etela rejender

హుజూరాబాద్ ఉపఎన్నికల (huzurabad bypoll) ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. దీనిలో భాగంగా పెంచిక‌ల్ పేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగ‌ళ‌వారం మంత్రి హరీశ్ రావు (harish rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ (bjp) అభ్యర్థి ఈటల రాజేందర్‌కు (etela rajender) ఆయన సవాల్ విసిరారు. గ్యాస్ సిలిండర్ (gas price) ధరలో రూ.291 రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానన హరీశ్ తెలిపారు. రుజువు చేయలేకపోతే ఎన్నికల నుంచి రాజేందర్ తప్పుకుంటారా అని మంత్రి సవాల్ చేశారు. ప్లేస్, టైం డిసైడ్ చేయాలన్నారు. ఈటల రాజేందర్‌కు అధికారంలో ఉన్నప్పుడు పేదలు కనిపించలేదని దుయ్యబట్టారు. 

గ్యాస్ ధ‌ర త‌గ్గాలంటే రాష్ట్రం పన్నులు త‌గ్గించుకోవాల‌ని ఈట‌ల అంటున్నార‌న్న మంత్రి హరీశ్... కానీ రాష్ట్రప్రభుత్వం తరపున ఒక్క రూపాయి ట్యాక్స్ వేయడంలేదని తెలిపారు. జీఎస్టీ పన్ను (gst) 5 శాతం మాత్రమే రాష్ట్ర వాటా ఉందని.. అది కూడా రూ.47 రూపాయలు మాత్రమే అన్నారు. తాను 20 ఏళ్లు ఉద్యమంలో పోరాడానని మంత్రి హరీశ్ గుర్తుచేశారు. టీఆర్ఎస్ (trs) అధికారం చేపట్టాక గ్రామీణ వైద్యులకు ట్రైనింగ్‌తో పాటు స‌ర్టిఫికెట్స్ ఇవ్వాలని నిర్ణయించిందని వెల్లడించారు. దీనికి బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ALso Read:Huzurabad Bypoll: ఈటల గెలవాలన్నదే మంత్రి హరీష్ కోరిక కూడా..: ఎమ్మెల్యే రఘునందన్ సంచలనం

ప్రభుత్వంపై అక్కసుతో కొందరు కోర్టుకు వెళ్లడంతో అది నిలిచిపోయిందని.. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యిందని మంత్రి చెప్పారు. కరీంనగర్‌లో గ్రామీణ వైద్యులకు సమస్యలు వస్తే మంత్రి కొప్పుల ఈశ్వర్ (koppula eshwar) వారి పక్షాన పోరాడారని హరీశ్ గుర్తుచేశారు. సిద్దిపేటలో 15 ఏళ్ల కిందటే గ్రామీణ వైద్యుల‌కు మంచి భవనం నిర్మించామ‌ని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈట‌ల ఆరుసార్లు గెలిచి హుజూరాబాద్‌లో ఒక్క భవనాన్ని కూడా నిర్మించలేదని మంత్రి చెప్పారు. తమ్ముడిలా చేరదీసిన కేసీఆర్‌కు ఘోరీ క‌డుతానంటున్న ఈట‌ల‌కు నీతినిజాయితీ ఉందా అని ప్రశ్నించారు.

బీసీల బిడ్డన‌ని చెప్పుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను ఈటల రాజేందర్ క‌బ్జా చేశారని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ ప‌థ‌కాల‌ను విమ‌ర్శించిన మంత్రి ఈట‌ల అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ గెలిస్తేనే హుజూరాబాద్‌లో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇళ్లు లేని పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తాన‌ని హ‌రీశ్‌రావు అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో గెల్లు శ్రీనివాస్ ను (gellu srinivas yadav ) గెలిపిస్తే అభివృద్ధి ప‌నుల్ని దగ్గర నుండి మరీ పూర్తిచేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఆటో యాక్సిడెంట్ జ‌రిగితే దానిని టీఆర్ఎస్ మీద రుద్దే ప్రయ‌త్నం చేశారన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి బండి సంజ‌య్ (bandi sanjay) స‌న్నిహితుడ‌ని హ‌రీశ్‌రావు ఆరోపించారు. 

 

"

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios