హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ రెండో జాబితా విడుదల చేసింది. తెలంగాణ అసెబ్లీని రద్దు చేసిన రోజే టీఆర్ఎస్ చీఫ్, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత రెండు స్థానాలను ప్రకటించారు. ఇప్పటి వరకు 107 మంది అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫామ్స్ కూడా అందజేశారు.

అయితే మిగిలిన 12 మంది అభ్యర్థుల ఎంపికను మాత్రం సస్పెన్షన్ లో పెట్టేశారు. సుమారు రెండు నెలలపాటు పెండింగ్ లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఎట్టకేలకు ప్రకటించారు. అందులో మళ్లీ రెండు స్థానాలను పెండింగ్ లో పెట్టారు. 

ఇకపోతే రెండో స్థానంలో హుజూర్ నగర్ అభ్యర్థిని సైతం ప్రకటించారు. ఈ టిక్కెట్ ఆశిస్తున్న తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఈ సారి కేసీఆర్ మెుండి చెయ్యి చూపారు. శంకరమ్మకు టిక్కెట్ ఇవ్వకుండా ఎన్నారై సైదిరెడ్డికి ఇచ్చారు. 

అయితే హుజూర్ నగర్ నియోజకవర్గంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది శంకరమ్మ. తనకు కేసీఆర్ అన్యాయం చెయ్యరని తనకు టిక్కెట్ ఇస్తారని గట్టిగా నమ్మింది. తనకు టిక్కెట్ ఇవ్వాలంటూ పలు నిరసనలు కూడా చేపట్టింది. 

అంతేకాదు తనకు కాకుండా వేరేవ్యక్తికి సీటు కేటాయిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ తెలంగాణ భవన్ వద్ద శంకరమ్మ చేట్టిన నిరసన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. డెడ్ లైన్ కూడా విధించారు. తనకు కాకుండా ఎన్నారై శానంపూడి సైదిరెడ్డికి ఇస్తే ఊరుకునేది లేదని పార్టీని గట్టిగా హెచ్చరించారు. 

స్వరాష్ట్ర సాధన కోసం తన బిడ్డ శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశాడని గుర్తు చేసింది కూడా. తనకు టిక్కెట్ రాకుండా మంత్రి జగదీష్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించింది. ఎట్టిపరిస్థితుల్లో తానే హుజూర్ నగర్ నుంచి బరిలో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. 

అయితే శంకరమ్మ ఆశలను ఆడియాశలు చేస్తూ ఆమె వ్యతిరేకించే ఎన్నారై సైదిరెడ్డికే టిక్కెట్ కేటాయించారు. సైదిరెడ్డికి టిక్కెట్ దక్కడంలో మంత్రి జగదీష్ రెడ్డి చక్రం తిప్పారు. ఆయన అనుకున్నట్లే సైదిరెడ్డికి పట్టుబట్టి టిక్కెట్ దక్కించుకున్నారు. దీంతో శంకరమ్మ ఎలా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

టికెట్ నాదే, గెలుపు నాదే: టీఆర్ఎస్ నేత శంకరమ్మ ధీమా

నాకు ఇచ్చినా, అప్పిరెడ్డికి ఇచ్చినా ఓకే...ఎన్నారైకి ఇస్తే చూపిస్తా: శంకరమ్మ ఆగ్రహం

మూడు ముక్కలాట:సైదిరెడ్డికి శంకరమ్మ కొలికి, మరో నేత పోటీ

టీఆర్ఎస్ టికెట్ రాకుంటే ప్రాణత్యాగమే...ఆ మంత్రి వల్లే పెండింగ్ : శంకరమ్మ

టీఆర్ఎస్ టికెట్ రాకుంటే ప్రాణత్యాగమే...ఆ మంత్రి వల్లే పెండింగ్ : శంకరమ్మ