హైద్రాబాద్ చందానగర్   పరిధిలోని నల్లగండ్లలో  శుక్రవారంనాడు  దారుణం  చోటు  చేసుకుంది.  భార్యను అత్యంత  కిరాతకంగా  రోడ్డుపైనే  భర్త నరేందర్ హత్య  చేశాడు. 


హైద్రాబాద్: నగరంలోని చందానగర్ పరిధిలోని నల్లగండ్లలో శుక్రవారం నాడు దారుణం చోటు చేసుకుంది . భార్య అంబికను భర్త నరేంద్ర అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంబికపై తొలుత రాయితో భర్త నరేందర్ దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన అంబిక ప్రాణాలు రక్షించుకొనేందుకు రోడ్డుపై పరుగెత్తింది. అంబికపై నరేందర్ వెంటపడి దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో అంబికపై నరేందర్ దాడికి దిగాడు. రోడ్డుపై అందరూ చూస్తున్న సమయంలో నరేందర్ అంబికపై కత్తితో దాడి చేశాడు.

చందానగర్ లో ని ఓ బొటికెలో అంబిక పనిచేస్తుంది., అంబికది తాండూరు. కుటుంబ కలహలతోనే నరేందర్ అంబికను హత్య చేశాడు. నరేందర్ , అంబిక దంపతులకు ఐదేళ్ల కూతురు కూడా ఉంది.