Asianet News TeluguAsianet News Telugu

యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించడానికి రూ. 20 వేల లంచం.. హోంగార్డు సహా ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌ శివారులో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసు నుంచి లారీ డ్రైవర్‌ను తప్పిస్తామని చెప్పి రూ. 20వేల డిమాండ్ చేసి తీసుకున్నారని హోంగార్డుతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ కేసులో రాచకొండ పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. హోంగార్డును సేవల నుంచి తొలగించబోతున్నట్టు పోలీసులు వివరించారు.
 

home guard along with other two arrested in extortion case in hyderabad
Author
Hyderabad, First Published Nov 28, 2021, 7:46 PM IST

హైదరాబాద్: కాళేశ్వరం నుంచి ఘట్‌కేసర్‌కు ఇసుక లోడ్‌తో వస్తున్న ఓ లారీ(Lorry) రాచకొండ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ బ్రిడ్జీ దగ్గర ఓ కారును ఢీకొట్టింది(Accident). ఈ యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించడానికి ఓ హోంగార్డు‌(Home Guard)తోపాటు మరో ఇద్దరు కలిసి లారీ డ్రైవర్ నుంచి రూ. 20వేలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ డబ్బు తీసుకున్నారు. కాగా, తన నుంచి రూ. 20 వేలు డిమాండ్ చేసి తీసుకున్నారని(Extortion) సదరు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ లంచం విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం, హోంగార్డు సహా ఆ ముగ్గురని పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. హోంగార్డు సేవల నుంచి సదరు నిందితుడిని తొలగించబోతున్నట్టు రాచకొండ పోలీసులు వెల్లడించారు.

నిందితులు ఏ1 ఎలిజర్ల బాలరాజు, ఏ2 దీమా శ్రీను, ఏ3 బండారపు శివలు అందరూ ఘట్‌కేసర్ నివాసులు. ఈ నెల 25న కాళేశ్వరం నుంచి ఘట్‌కేస్‌కు వస్తున్న ఇసుక లారీ ఎన్ఎఫ్‌సీ నగర్ బ్రిడ్జీ దగ్గరకు చేరుకున్నాక ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘటనపై ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఈ యాక్సిడెంట్ సమాచారం తెలియగానే డ్యూటీలో ఉన్న ఏ3 హోంగార్డు ఘట్‌కేసర్ పెట్రోల్ మొబైల్ 1 వాహనం(ఆయన వెహికల్ డ్రైవర్‌గా వెళ్లాడు)పై అక్కడికి చేరుకున్నాడు. స్పాట్‌లో లారీ, లారీ డ్రైవర్ తప్పా మరెవరూ లేరు. దీంతో హోంగార్డు బండారపు శివలో దుర్బుద్ధి వచ్చింది.

Also Read: పలాసలో ప్రమాదం... 108 అంబులెన్స్ ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన రైలు

ఈ ఘటనను ఇక్కడ ఎవరూ చూడలేదని చెబుతూ లారీని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి ఆపాలని ఆ లారీ డ్రైవర్‌కు బండారపు శివ సూచనలు చేశాడు. ఆయన సూచనల మేరకు డ్రైవర్ జాజుల నర్సింహా లారీని దూరం తీసుకెళ్లాడు. ఇంతలోనే ఇది వరకు హోంగార్డుగా పని చేసిన ఏ1 బాలరాజు హోంగార్డు బండారపు శివకు ఫోన్ చేశాడు. ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్‌లో ఏడాదికాలంగా ఉన్న ఆటోను తీసుకెళ్లడానికి తన మిత్రుడు శ్రీనుతో కలిసి వచ్చారని కాల్ చేశాడు. ముందు ఆ లారీ డ్రైవర్ దగ్గరకు వారు వెళ్లాలని, అక్కడికి చేరిన తర్వాత ఆ లారీ డ్రైవర్ వివరాలు తనకు అందించాల్సిందిగా ఆదేశించాడు. ఏ1, ఏ2లు వెంటనే లారీ డ్రైవర్ దగ్గరకు వెళ్లి వివరాలు అందించారు. ఏ3 శివ సూచనల మేరకు లారీ డ్రైవర్ నుంచి రూ. 20వేలు తీసుకున్నారు. అనంతరం లారీ డ్రైవర్‌ను పంపించేశారు.

ఈ ఘటన తర్వాత లారీ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించి హోంగార్డుతోపాటు మరో ఇద్దరు తన నుంచి రూ. 20వేలు లాక్కున్నారని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. అంతేకాదు, ఏ2 శివను హోంగార్డు సేవల నుంచి తొలగించాల్సిందిగా రిపోర్టును పంపిస్తున్నట్టు రాచకొండ పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios