Asianet News TeluguAsianet News Telugu

పలాసలో ప్రమాదం... 108 అంబులెన్స్ ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన రైలు

108 అంబులెన్స్ ను ఢీకొట్టిన రైలు దాదాపు 100మీటర్లు ఈడ్చుకెళ్లిన ఘోర ప్రమాదం శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది. 

Train hits ambulance at srikakulam district
Author
Palasa, First Published Nov 28, 2021, 7:53 AM IST

శ్రీకాకుళం: రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫారంపైకి వచ్చిన 108 అంబులెన్స్ ను రైలు ఢీకొట్టి దాదాపు 100మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన దుర్ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం నుండి అంబులెన్స్ లోని వారు సురక్షితంగా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ కు ఓ రైల్లో వచ్చిన పేషెంట్ ను హాస్పిటల్ కు తీసుకువెళ్లేందుకు 108 అంబులెన్స్ ఫ్లాట్ ఫారం పైకి  వచ్చింది. అయితే 108 ambulanceడ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రైలుపట్టాలకు సమీపంలో వాహనాన్ని నిలిపాడు. దీంతో వేగంగా వచ్చిన రైలు అంబులెన్స్ ను ఢీకొట్టింది.  

అంబులెన్స్ ను రైలు కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి అంబులెన్సు డ్రైవరు, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం ఘోరంగా జరిగినా ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

read more  కడపలో ఫారెస్ట్ అధికారులపై తమిళ కూలీల దాడి: పారిపోతూ ఒకరి మృతి, ఇధ్దరికి గాయాలు

ఇదిలావుంటే హైదరాబాద్ చోటుచేసుకున్న రోడ్డుప్రమాదం ఓ పెళ్లింట విషాదం నింపింది. పెళ్లయిన 24 గంటలు కూడా గడవకముందే నూతన వధూవరులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భర్తతో కలిసి వధువు పుట్టింటికి వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో తొలుత వరుడు మృతి చెందాడు. అదే యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన నవ వధువు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. 

హైదరాబాద్ శివార్లలోని శేరిలింగంపల్లికి  చెందిన శ్రీనివాసులుకు, తమిళనాడుక చెందిన కనిమొళితో అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత వధువు సొంతూరైన చెన్నైకి  భార్యాభర్తలిద్దరూ వెళ్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నవవరుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇదే ప్రమాదంలో తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లిన కనిమొళిని చికిత్స పొందుతూ మృతిచెందింది. 

పెళ్ళైన 24 గంటలు గడవక ముందే శ్రీనివాసులు ప్రాణాలు పోగొట్టుకోగా చికిత్స పొందుతూ ఈరోజు వధువు కనిమొళి మరణించింది. దీంతో కొద్దిరోజులుగా ఆనందాలు వెల్లివిరిసిన పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios