కోమటిరెడ్డి, సంపత్‌ కేసు: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు

High court serious warning to Telangana government over congress mla's case
Highlights

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్దరణ విషయంలో  రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది.  ఎమ్మెల్యే పదవులను పునరుద్దరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడ ప్రభుత్వం అమలు చేయలేదు


హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్దరణ విషయంలో  రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది.  ఎమ్మెల్యే పదవులను పునరుద్దరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడ ప్రభుత్వం అమలు చేయలేదు.దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్ ల శాసనసభసభ్యత్వాల పునరుద్దరణ విషయమై వారం రోజుల్లోపుగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌పై హెడ్‌పోన్ విసిరిన  విషయమై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేశారు.

తమ సభ్యత్వాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  సంపత్‌కుమార్‌లు  హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.వెంటనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే  ఈ ఆదేశాలను అమలు చేయలేదు.

మరో వైపు  ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ కూడ  ఈ తీర్పును కొట్టివేసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును కూడ  ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ తీర్పును అమలు చేయకపోవడంతో  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ విచారణలో  అడిషనల్ ఏజీపై  హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ న్యాయవాదివా, పార్టీ న్యాయవాదివా అంటూ కోర్టు  అడిషనల్ ఏజీపై  వ్యాఖ్యానించింది. ఎందుకు ఇంతకాలం పాటు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.

వారం రోజుల్లోపుగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లేకపోతే కోర్టుకు అసెంబ్లీ సెక్రటరీ హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆగష్టు 3వ తేదీకి వాయిదా వేసింది.

ఈ వార్తలు కూడ చదవండి:సభ్యత్వాల రద్దు: కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కోమటిరెడ్డి, సంపత్

                                టిఆర్ఎస్‌కు మరో షాక్: 12 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

 

loader