హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె ను పరిష్కరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా లేదా అనే విషయాన్ని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్‌ను మార్చుకోలేదా అని హైకోర్టు అడిగింది.  తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

Also read:మళ్లీ తప్పుడు లెక్కలేనా: అధికారులపై హైకోర్టు గరం, రామకృష్ణారావు క్షమాపణ

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో గురువారం నాడు కూడ విచారణ జరిగింది.ఈ విచారణ సమయంలో కేంద్రం తరపున  లాయర్ రాజేశ్వర్ రావు తన వాదనలను విన్పించారు.  ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులు సమ్మె విరమించేందుకు తాత్కాలికంగా రూ. 47 కోట్లు విడుదల చేయాలని తాము కోరితే ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వని విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది.

also readRTC Strike: ఆర్టీసీపై కీలక ప్రకటన... సమీక్షా సమావేశంలో కేసీఆర్ నిర్ణయమిదేనా..?

ఆర్టీసీ విభజనకు కేంద్రం అనుమతి ఇచ్చిందా అని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది.. ఈ సందర్భంగా కేంద్రం తరపున హైకోర్టుకు హాజరైన కేంద్రం తరపున ఈశ్వరరావు అనే లాయర్ కేంద్రం తరపున వాదనలను విన్పించారు.

ఆర్టీసీ విభజనకు కేంద్రం నుండి ఎలాంటి అనుమతి లేదని కేంద్రం తరపు లాయర్  ఈశ్వరరావు చెప్పారు.ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రం వాటా 33 శాతం ఉందని అయితే టీఎస్ఆర్టీసీకి 33 శాతం నిధులు ఆటో‌మెటిక్‌గా బదిలీ కావని కేంద్రం వాదించింది

also read:కేసీఆర్ లక్ష్యం అదే.... మిలియన్ మార్చ్ కు మా మద్దతు: బీజేపీ చీఫ్ లక్ష్మణ్

ఆర్టీసీ విభజనకు కేంద్రం ఆమోదం తెలిపినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం తరపున న్యాయవాది ప్రకటించారు. ఆర్టీసీ 9వ షెడ్యూల్ కిందకు వస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి చెప్పారు. ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని సీఎస్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్  హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఆర్టీసీ విభజన పెండింగ్‌లో ఉంటే కొత్త ఆర్టీసీ ఏర్పాటు ఎలా సాధ్యమని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీని ఏపీఎస్ఆర్‌టీసీగా, టీఎస్ ఆర్టీసీగా పిలవాలా అని హైకోర్టు ప్రశ్నించింది.

ఆర్టీసీ విభజనకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్దిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు చెప్పారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొందని ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు చెప్పారు.

సెక్షన్ 47ఏపై హైకోర్టులో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంతో పాటు కార్మిక సంఘాల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రజల కోసం  ప్రభుత్వం తన స్టాండ్‌ను మార్చుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ప్రజల కోసం ప్రభుత్వం మానవతా థృక్పథంతో పనిచేయాలని  హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసు విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.