హైదరాబాద్:ఆర్టీసీ సమ్మెపై ఐఎఎస్ అధికారులు ఇచ్చిన వివరణపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కారం కిందకే వస్తోందని  హైకోర్టు  అభిప్రాయపడింది.పరస్పర విరుద్దంగా నివేదికలు ఇస్తారని హైకోర్టు సీనియర్ ఐఎఎస్ అధికారులను ప్రశ్నించింది.

గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణను ప్రారంభించింది. బుధవారం నాడు సాయంత్రమే తెలంగాణ హైకోర్టుకు ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వం నుండి బకాయిల చెల్లింపుతో పాటు జీహెచ్ఎంసీ నుండి రావాల్సిన బకాయిలు తదితర విషయాలపై ఆర్టీసీ యాజమాన్యం, జీహెచ్ఎంసీ వేర్వేరుగా   అఫిడవిట్లను దాఖలు చేశాయి.

also readRTC Strike: ఆర్టీసీపై కీలక ప్రకటన... సమీక్షా సమావేశంలో కేసీఆర్ నిర్ణయమిదేనా..?

ఈ అఫిడవిట్లపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఆర్టీసీ సమ్మెపై విచారణ  సమయంలో  స్వయంగా హాజరుకావాల్సిందిగా తెలంగాణ సీఎఎస్ ఎస్‌కె జోషీ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్దిక కార్యదర్శి రామకృష్ణారావు, రవాణ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ తదితరులు స్యయంగా హైకోర్టుకు హాజరయ్యారు.

ఐఎఎస్ అధికారులు అసమగ్రంగా నివేదికలు ఇవ్వడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఐఎఎస్ అధికారులు అసమగ్రంగా నివేదికలు ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.

కాగ్ నివేదికతో పాటు, తమ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా అఫిడవిట్‌ను సమర్పించినట్టుగా ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు వివరించారు. సమయం తక్కువ ఉన్నందున రికార్డుల మీద ఆధారపడాల్సి వచ్చిందని రామకృష్ణారావు వివరణ ఇచ్చారు.

మొదటి నివేదిక పరిశీలించకుండానే రెండో నివేదికను ఇచ్చారా అని కోర్టు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావును ప్రశ్నించింది.  సమయం లేనందున రికార్డుల మీద  నివేదికను తయారు చేసినట్టుగా రామకృష్ణారావు చెప్పారు.

అసమగ్రంగా నివేదిక ఇవ్వడంపై హైకోర్టును రామకృష్ణారావు క్షమాపణలు కోరారు. క్షమాపణలు చెప్పడం సరైంది కాదన్నారు. వాస్తవాలు చెప్పాలని హైకోర్టు ఆర్దిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావును ఆదేశించింది.

also read:కేసీఆర్ లక్ష్యం అదే.... మిలియన్ మార్చ్ కు మా మద్దతు: బీజేపీ చీఫ్ లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుండి  ఈ ఏడాది అక్టోబర్ మాసం వరకు లెక్కలను ఈ నివేదిలో పొందుపర్చినట్టుగా  రామకృష్ణారావు వివరించారు. కోర్టుకు తప్పుడోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలతో పాటు పదాలను వాడారని కోర్టు అభిప్రాయపడింది. ఈ నివేదికపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది.

రుణ పద్దుల కింద కేటాయించిన నిధులను అప్పులు కాదని గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని హైకోర్టు చెప్పింది. ఇంత వరకు ఏ బడ్జెట్‌లో కూడ ఇలాంటివి చూడలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీఎంతో సైతం తప్పుడు లెక్కలతో ప్రకటనలు ఇప్పించారని హైకోర్టు ఐఎఎస్ అధికారులపై మండిపడింది.

కేబినెట్‌ మంత్రికి తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని మోసం చేసినట్టేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ మంత్రి అజయ్ కు తప్పుడు లెక్కలు ఇచ్చారని కోర్టు  అభిప్రాయడింది. సీఎంతో సైతం తప్పుడు లెక్కలతో ప్రకటనలు ఇప్పించారని హైకోర్టు ఐఎఎస్ అధికారులపై మండిపడింది.