Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు జగన్ షాక్: ఆర్టీసీపై మొండిపట్టు, టీపీసీసీ రేసులో రేవంత్

ఆర్టీసీ సమ్మె చుట్టూనే తెలంగాణ రాజకీయాలు ప్రధానంగా గత వారం చోటు చేసుకొన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకూడదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పీసీసీ చీఫ్ పదవిని తనకు ఇవ్వాలని జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరారు 

Weekend review:important incidents from nov 11 to nov 17 in telangana politics
Author
Hyderabad, First Published Nov 17, 2019, 4:48 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా సాగుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం తెలంగాణకు షాకిచ్చింది. జాతీయ హోదా ఇవ్వకూడదని సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది.తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం జగ్గారెడ్డి  కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ధరఖాస్తు చేసుకొన్నాడు. గత వారంలో తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా ఆర్టీసీ సమ్మెపైనే రాజకీయ పార్టీలు కేంద్రీకరించాయి. 

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ప్రధానమైన ఆర్టీసీ విలీనం డిమాండ్‌తో పాటు మరో  46 డిమాండ్లను  నెరవేర్చాలని  ఆర్టీసీ జేఎసీ డిమాండ్ చేస్తోంది. 

Alo read:నా ఫోన్‌ను కూడ ట్యాప్ చేసి ఉండొచ్చు: ఎంపీ బండి సంజయ్

అయితే ఆర్టీసీ జేఎసీ నేతలు తమ ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌పై వెనక్కు తగ్గారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్‌ విషయంలో వెనక్కి తగ్గి ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఎసీ ఈ నెల 18వ తేదీన సడక్ బంద్‌కు పిలుపునిచ్చింది.  మరో వైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇందిరాపార్క్ వద్ద దీక్షకు ఈ నెల 17న పిలుపునిచ్చాడు. దీంతో తార్నాకలోని మందకృష్ణ మాదిగను పోలీసులు ఈ నెల 17న ఉదయం అరెస్ట్ చేశారు.

మరో వైపు ఈ నెల 16వ తేదీ నుండే ఆర్టీసీ జేఎసీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నెల 16వ తేదీనే ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన తన ఇంట్లోనే దీక్షకు దిగారు. మరోవైపు జేఎసీ కో కన్వీనర్ రాజిరెడ్డి కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్వత్థామరెడ్డి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ సమయంలో ప్రభుత్వంపై ఆర్టీసీ ఈ వారంలో కీలక వ్యాఖ్యలు చేసింది.ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విషయంలో కేబినెట్ నిర్ణయంపై కూడ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించారు.

అయితే కేబినెట్ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జిల కమిటీకి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఆర్టీసీ విభజన విషయమై హైకోర్టు విచారణ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా ఆర్టీసీ విభజన జరగలేదని కేంద్రం హైకోర్టుకు స్పష్టం చేసింది.ఆర్టీసీ సమ్మె విషయమై ఈ నెల 18వ తేదీన హైకోర్టు మరోసారి విచారణ చేయనుంది.

టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ

ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వి.హనుమంతరావు, జగ్గారెడ్డిలు ఈ పదవిని తమకు కట్టబెట్టాలని కోరుతున్నారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు  పోటీ పడుతున్నారు.

పీసీసీ అధ్యక్ష పదవి కోసం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎఐసీసీకి తన బయోడేటాను పంపారు. వెరైటీగా ఈ బయోడేటాను ఆయన పార్టీ నాయకత్వానికి పంపించారు. ఏ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 ఏ సమయంలో పార్టీ మారారనే విషయాలను బయోడేటాలో చేర్చారు. అంతేకాదు తనపై ఉన్న కేసుల వివరాలను కూడ  ఆయన బయోడేటాలో పొందుపర్చాడు.మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరారు. ఇటీవల గులాం నబీ ఆజాద్  హైద్రాబాద్‌ వచ్చిన సమయంలో ఆయన ఈ విషయమై ఆజాద్ ను కలిసి  విన్నవించారు.

బీసీ సామాజిక వర్గం నుండి  తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని వి.హనుమంతరావు కూడ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడ ఈ పదవిని ఆశిస్తున్నారు. 

అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వడాన్ని పార్టీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీ కోసం ఇంత కాలం కష్టపడిన వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

కాళేశ్వరంపై కేసీఆర్ కు షాకిచ్చిన జగన్

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వొద్దని కోరుతూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని  తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ కూడ హాజరయ్యారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇవ్వకూడదని అడ్డుపడుతూ అఫిడవిట్ దాఖలు చేయడంపై టీఆర్ఎస్ నేతలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో  టీఆర్ఎస్ ఎంపీలు  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయమై డిమాండ్‌ చేయనున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios