తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్నిఅస్థిరపర్చేందుకు విపక్షాలు కుట్ర పన్నినట్టుగా ఆధారాలను చూపాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్టీసీ ఎండి సునీల్ శర్మను డిమాండ్ చేశారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్ధిరపర్చేందుకు తాము కుట్ర చేసినట్టుగా ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఆధారాలను చూపాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also read:కేసీఆర్ కు జగన్ షాక్: ఆర్టీసీపై మొండిపట్టు, టీపీసీసీ రేసులో రేవంత్
ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విపక్షాలు కుట్ర పన్నారని ఐఎఎస్ అధికారి సునీల్ శర్మ అఫిడవిట్ సమర్పించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.సునీల్ శర్మ సర్పించిన తప్పుడు అఫిడవిట్‌ను సుమోటోగా స్వీకరించి న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఎవరి ప్రోద్భలంతో నిరాధార ఆరోపణలతో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలతో హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై తాను పార్లమెంట్‌లో ప్రశ్నిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు విపక్షాలు కుట్ర పన్నినట్టుగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన సునీల్ శర్మను డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఆర్టీసీ కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన తాము పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణను సీఎం కేసీఆర్ తన జాగీరుగా భావిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డగి విమర్శించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైంది కాదని పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభిప్రాయపడ్డారు.ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.
