హైదరాబాదులోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలకు పాల్పడకుండా మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ హైకోర్టు మంగళవారం నిషేధించింది.

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిరంజీవి, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ.. వివాదాస్పద స్థలంలో యధాతధ స్థితిని కొనసాగించాలని తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం జారీ చేసింది. 595 గజాల స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు కేటాయించారని.. ఆ స్థలాన్ని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ చిరంజీవికి విక్రయించిందని జె. శ్రీకాంత్ బాబు, తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిమీద హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ స్థలాన్ని జిహెచ్ఎంసి స్వాధీనం చేసుకోలేదని.. దీంతో నిబంధనలకు విరుద్ధంగా దానిని అమ్మారని వారు పేర్కొన్నారు. ఈ వివాదాస్పద స్థలంలో చిరంజీవి నిర్మాణం చేపట్టారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని జిహెచ్ఎంసీని, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ ఏప్రిల్ 25కి విచారణ వాయిదా వేసింది. 

పెళ్లైన రెండు వారాలకే.. భార్యను, అత్తను కడతేర్చిన అల్లుడు.. కారణం ఏంటంటే..

తెలంగాణ హైకోర్టు మంగళవారం హకీంపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 102, 120లో వివాదాస్పద 595 చదరపు గజాల స్థలంలో నిర్మాణ పనులు చేపట్టొద్దని సినీనటుడు చిరంజీవికి ఆదేశించింది. 2022లో జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీకి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ ఈ ప్లాట్‌ని క్రమబద్ధీకరిస్తూ చిరంజీవికి బదిలీ చేసింది.

సొసైటీ ఛైర్మన్ బి. రవీంద్రనాథ్, కోశాధికారి నాగరాజు, నటుడి భవనం వెనుక ఉన్న ప్లాట్‌ను చదరపు గజానికి రూ. 64,000 చొప్పున అమ్మారని ఆరోపించారు. ఈ మేరకు సొసైటీ సభ్యులు జంపాల శ్రీకాంత్‌బాబు, ఎం. ప్రభాకర్‌రావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లో, సొసైటీ మార్కెట్ విలువ రూ. 20 కోట్లు కాగా, రూ 3.83 కోట్లకు విక్రయించిందని పేర్కొన్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. రంగంలోకి సిట్, ఎవరిని వదిలేది లేదన్న ఏఆర్ శ్రీనివాస్

అంతేకాదు, ఇది ప్రభుత్వ భూమిఅని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందింది కాబట్టి సొసైటీకి దానిపై ఎటువంటి అధికారం లేదని వారు చెప్పారు. ఈ మేరకు పిటిషనర్ల తరఫు న్యాయవాది రోహిత్ పోగుల సింగిల్ జడ్జి బెంచ్‌కు తెలిపారు. హౌసింగ్‌ సొసైటీ మేనేజింగ్‌ కమిటీ అనుమతి లేకుండానే ప్లాటును అన్యాక్రాంతం చేసిందని భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. ఇందుకోసం మేనేజింగ్ కమిటీతో రిజిస్ట్రేషన్ అథారిటీ కుమ్మక్కయ్యిందని పోగుల ఆరోపించారు.

చిరంజీవికి అనుకూలంగా జరిగిన ఈ మొత్తం పరిణామాల కారణంగా.. ఆ వివాదాస్పద స్థలంలో నిర్మాణం జరుగుతోందని కోర్టును ఆయన కోర్టును ఆశ్రయించారు. అక్కడ నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని, ఆస్తిని మరింత అన్యాక్రాంతపరచకుండా ఆంక్షలు విధించాలని కోరారు. చిరంజీవి, జీహెచ్‌ఎంసీ, జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ కేసును ఏప్రిల్‌ 25కి వాయిదా వేశారు. దీంతో గత కొద్దిరోజులుగా నానుతున్న ఈ వ్వవహారం మీద ఫిల్మ్ నగర్ లో గుసగుసలు మొదలయ్యాయి.