హైదరాబాద్‌ను వణికించిన భారీ వర్షం.. ప్రమాదకరంగా మూసీ, మరో మూడు రోజులు ఇంతే

హైదరాబాద్‌ను వర్షం వణికించింది. దీంతో మూసీలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి... మూసారాంబాబ్ వంతెన పైనుంచి ప్రవహిస్తూ వుండటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రోడ్లు జలమయం కావడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. 

Heavy rains lash Hyderabad

హైదరాబాద్‌ను వర్షం వణికించింది. బుధవారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలో డ్రైన్‌లు, నాళాలు పొంగిపోర్లాయి. ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్, సోమాజిగూడ, లక్డీకాపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, గోషామహాల్, మాదాపూర్, కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో మూసీలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి... మూసారాంబాబ్ వంతెన పైనుంచి ప్రవహిస్తూ వుండటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. 

ఇకపోతే.. అసలే వర్షాలతో అల్లాడుతుంటే వాతావరణ శాఖ షాకిచ్చే న్యూస్ చెప్పింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు ఎల్లో, రేపు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయనున్నట్లు ఐఎండీ పేర్కొంది. 

ALso REad:Bengaluru rains: బెంగ‌ళూరును వ‌ద‌ల‌ని వ‌ర్షాలు.. మ‌రో నాలుగైదు రోజులు వాన‌లు.. తాజా వివరాలు ఇవిగో

మరోవైపు.. క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రాన్ని వ‌ర్షాలు వ‌ద‌లడం లేదు. ఆదివారం కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా న‌గ‌రంలోని సరస్సులు, మురికినీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల‌ను వ‌ర‌ద‌ల‌ను ముంచెత్తాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇలాంటి దారుణ ప‌రిస్థితులు ఉన్న బెంగ‌ళూరు న‌గ‌రంలో మ‌ళ్లీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని భారత వాతావరణ శాఖ అంచ‌నా వేసింది. రానున్న ఐదు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వ‌ర‌ద ప్ర‌భావాల‌ను ఎదుర్కొవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. 

కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు పర్యవేక్షణ కేంద్రం (KSNDMC) ప్రకారం, ముఖ్యంగా బెంగళూరు, రాష్ట్రంలోని తీర ప్రాంతాలలో చాలా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు వివిక్త భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజాగా కురిసిన వ‌ర్షాల‌తో కుండపోత వర్షంతో రోడ్లు నీటితో నిండిపోయాయి. అనేక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, గృహాలు నీటిలో మునిగిపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. చాలా మంది రోడ్డుపై, ఇళ్లల్లోనే ఉండిపోయారు. మునిగిపోయిన ప్రాంతాల నుండి నివాసితులను రక్షించడానికి పడవలు, ట్రాక్టర్లను కూడా మోహరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios