మ‌రో నాలుగు రోజులు తెలంగాణ‌లోని పలు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు.. : ఐఎండీ

Hyderabad: తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ లో ఈ నెల 19 వరకు ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, ఇప్ప‌టికే కురిసిన వాన‌ల కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో వ‌ర్ష‌పు నీరు కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. 
 

Heavy rains in Telangana for the next four days : IMD  RMA

Heavy rains in Telangana: రుతుపవ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంలో దేశంలోని ప‌లు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాన‌లు ప‌డుతున్నాయి. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ లో ఈ నెల 19 వరకు ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, ఇప్ప‌టికే కురిసిన వాన‌ల కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో వ‌ర్ష‌పు నీరు కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణలో ఈ నెల 20వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి వాతావరణ పరిస్థితుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచ‌నా వేసింది. హైదరాబాద్ లోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఈ నెల 19 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) నివేదిక ప్రకారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్ గా న‌మోదుకాగా, హైదరాబాద్లో 32.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

టీఎస్ డీపీఎస్ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందనీ, రాష్ట్రవ్యాప్తంగా 32 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19 వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఐఎండీ హైదరాబాద్, టీఎస్డీపీఎస్ చేసిన అంచనాలను పరిగణనలోకి తీసుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

వాతావ‌ర‌ణ శాఖ అంతకుముందు, తెలంగాణలో ఐదు రోజుల పాటు (జూన్ 16 నుంచి) ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర జిల్లాలైన ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈ వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 18న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందనీ, దీని ప్రభావంతో ఈ నెల 21 వరకు తెలంగాణలోని ఉత్తర జిల్లాలతో పాటు మహబూబాబాద్, వరంగల్ (రూరల్), హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios