భారీ వర్ష హెచ్చరికలు.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించిన ఈవీడీఎం
Heavy Rains: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంలాలు భారీ వర్షం కారణంగా జలమయం అయ్యాయి. మరోసారి భారీ వర్షాలు గురించి ప్రస్తావిస్తూ సంబంధిత విభాగాలను ప్రజలను హెచ్చరించాయి. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నాయి.
EVDM issues heavy rainfall alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వం విస్తృత వానల నేపథ్యంలో స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలు భారీ వర్షం కారణంగా జలమయం అయ్యాయి. మరోసారి భారీ వర్షాలు గురించి ప్రస్తావిస్తూ సంబంధిత విభాగాలను ప్రజలను హెచ్చరించాయి. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వారంతం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) విభాగం గురువారం భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలనీ, అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయాలని కోరింది. నగరంలో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని ఈవీడీఎం డైరెక్టర్ అధికారిక హ్యాండిల్ నుంచి వచ్చిన ట్వీట్ లో పేర్కొన్నారు.
"హైదరాబాద్ నగరంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దయచేసి ఇంట్లోనే ఉండండి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. డీఆర్ఎఫ్ సహాయం కోసం పౌరులు 9000113667 డయల్ చేయవచ్చు" అని ఈవీ అండ్ డీఎం డైరెక్టర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం కాని ప్రయాణాలకు దూరంగా ఉండాలని పౌరులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.
ఇదిలావుండగా, రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు. భారీ వర్షాలను ప్రస్తావిస్తూ తూర్పు జిల్లాలను ఐఎండీ హెచ్చరించింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ములుగు, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలావుండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వర్షపాత లోటును తగ్గించడానికి దోహదపడ్డాయి. ఐఎండీ గణాంకాల ప్రకారం జూన్ చివరి నాటికి రాష్ట్రంలో 50 శాతం లోటు ఉంది. జూలైలో కేవలం 19 రోజుల్లో 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం రుతుపవనాల లోటు 9 శాతానికి చేరింది. ఇక మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదికి భారీగా ఇన్ ఫ్లో రావడంతో పలు సరస్సులు, నీటి వనరులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొన్ని గ్రామాల్లో రోడ్లు నీట మునగడంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాచలం దేవస్థానం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 30. 70 అడుగులకు పెరిగింది. ప్రస్తుతం 42 అడుగులు దాటిందని సమాచారం. గత జూలైలో నీటిమట్టం 70అడుగులు దాటడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.