కడెం ప్రాజెక్ట్‌లోకి భారీ వరద.. మొరాయించిన నాలుగు గేట్లు, భయాందోళనలో స్థానికులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. మరోవైపు.. ప్రాజెక్ట్‌లోని  2, 3, 16, 18 నెంబర్ గేట్లు మొరాయిస్తూ వుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

heavy inflow to kadem project amid heavy rains ksp

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల ధాటికి వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లు నిండుకుండలా మారాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తూ వుండటంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్‌లో వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో గత రెండు మూడు రోజులు నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం జలాశయంలోకి వేలాది క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 695.500 అడుగులకు చేరుకుంది. జలాశయంలో లక్షా 86 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శుక్రవారం ఉదయం 9 గేట్లు ఎత్తి గోదావరిలోకి 1,43,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. 

ALso Read: Fish rain: చేపల వాన.. ఆ ఊరంతా చేప‌లే.. !

మరోవైపు.. కడెం ప్రాజెక్ట్‌లోని  2, 3, 16, 18 నెంబర్ గేట్లు మొరాయిస్తూ వుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని..అధికారులు అండగా వుంటారని వారు భరోసా కల్పించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios