Asianet News TeluguAsianet News Telugu

Fish rain: చేపల వాన.. ఆ ఊరంతా చేప‌లే.. !

Srikakulam: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రించింది. అయితే, రాష్ట్రంలో చేప‌ల వాన కురిసింది. వ‌ర్షంతో పాటు పెద్ద సంఖ్య‌లో చేప‌లు ప‌డ్డాయి. ఇది అరుదైన ఘ‌ట‌న‌గా ప‌రిశోధ‌కులు చేబుతున్నారు. శ్రీకాకుళంలో చోటుచేసుకున్న ఈ చేపల వాన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

Fish rain in Vajrapukotturu mandal of Srikakulam, Andhra Pradesh RMA
Author
First Published Jul 21, 2023, 9:40 AM IST | Last Updated Jul 21, 2023, 9:53 AM IST

Heavy rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రించింది. అయితే, రాష్ట్రంలో చేప‌ల వాన కురిసింది. వ‌ర్షంతో పాటు పెద్ద సంఖ్య‌లో చేప‌లు ప‌డ్డాయి. ఇది అరుదైన ఘ‌ట‌న‌గా ప‌రిశోధ‌కులు చేబుతున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. శ్రీకాకుళంలోని వజ్రపుకొత్తూరు మండలం వజ్రపు కోనేరు గ్రామంలో చేపల వర్షం కురిసింది. గ్రామంలో వ‌ర్షంతో పాటు చేప‌లు ప‌డ‌టంతో దాదాపు ఊరిలోని చాలా ప్రాంతలో చేప‌లు క‌నిపించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షంతో పాటు చేపలు కిందపడ్డాయ‌ని గ్రామ‌స్తులు పేర్కొంటున్నాయి. గ్రామంలో పలు చోట్ల చేపలు వర్షంతో పాటు చేపలు ప్రత్యక్షమయ్యాయి.

కాగా, గ‌తేడాది కూడా  తెలంగాణలోని జగిత్యాల పట్టణంలో చేప‌ల వాన ప‌డింది. ఆకాశం నుంచి వ‌ర్షంతో పాటు చేప‌లు ప‌డ‌టం చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఈ అరుదైన ఘటనను కొందరు తమ కెమెరాలో బంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. జంతువుల వర్షం అని పిలువబడే అరుదైన వాతావరణ దృగ్విషయంలో.. పీతలు, చిన్న చేపలు, కప్పలు వంటి చిన్న జలచరాలు నీటి గుంతల ద్వారా ఎత్తుకుని ఆకాశంలోకి పీల్చబడతాయి. తరువాత, నీటి ప్రవాహం శక్తిని కోల్పోయినప్పుడు, ఈ జీవులు భూమిపై నీటితో వర్షం కురిపిస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. 2021 అక్టోబర్ లో ఉత్తర్ ప్రదేశ్ లోని భదోహి జిల్లాలో కూడా చేప‌ల వ‌ర్షం కురిసింది. ఆ రోజు ఈ ప్రాంతంలో బలమైన గాలులు, భారీ వర్షం కురవడంతో సముద్ర జీవులు అతలాకుతలమయ్యాయి. చౌరీలోని కందియా గేట్ ప్రాంతంలో చిన్న చిన్న చేపలు వర్షం కురవడం చూపరులంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios