అంతరించిపోతున్న పిట్టలదొరలు నవీన కాలంలో కాలగర్భంలో కలిసిన కల తెలంగాణ, ఎపిలో కనుమరుగవుతున్న పిట్టలదొరలు

తెలుగు రాష్ట్రాల్లో అంతరించిపోతున్న కళల జాబితాలో 'పిట్టల దొర' కళ కూడా చేరిపోయింది. అందరినీ తన మాటల గారడితో నవ్విస్తూ, మంత్ర ముగ్ధులను చేయడం పిట్టల దొర నైజం. కానీ అంతిమంగా అందరినీ ఆనందింపజేసిన తను మాత్రం నవ్వుల పాలయ్యేవాడు.

ఇంత సాంకేతిక పరిఙ్ణానం పెరిగిపోయిందని విర్రవీగుతూ చంకలు గుద్దుకునే కాలంలో, కడుపు కాలి, తిండికి లేక, కుటుంబ బరువులు మీదపడో, బడికి దూరమై తాతలు ఇచ్చిన లొట్టి తుపాకీనే వంశపారంపర్య ఆస్థిగా భావించి రోడ్డెక్కిన బాల్యపు బతుకులు ఇంకా ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాం కదా?

గతంలో ఊరికొకరు పిట్టల దొరలు ఉండేవారు. కానీ నవీన కాలంలో పిట్టల దొర కళ కాలగర్భంలో కలిసిపోయింది. అయినా నేటికీ ఇలాంటి పిట్టల దొరలు అక్కడక్కడా దర్శనమిస్తూనే ఉంటారు. ఎపిలో ఒక పసివాడు పిట్టల దొర వేశం వేసి చెప్పే మాటలను అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెసిఆర్ వాగ్దానాల మీద కొత్త జోక్ పేలింది