పార్టీ కార్యకర్తలో నైరాశ్యం టిడిపిలో అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్

టిడిపి పార్టీ ఏర్పాటై 35 ఏళ్లవుతున్నది. ఏర్పాటైన నాడే తెలుగు రాజకీయాల్లో సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు పార్టీలో ఎంతో మంది నాయకులు పుట్టారు. పుట్టినవారు రకరకాల కారణాలతో బయటకు వెళ్లిపోయారు. కొందరు వ్యక్తిగత స్వార్థం కోసం వెళ్లిపోయారు. ఇంకొందరు వత్తిళ్లు తట్టుకోలేక వెళ్లిపోయారు. మరికొందరు ఏదో ఒక కారణం చేత వెళ్లిపోయి మళ్లీ పార్టీలోకి తిరిగొచ్చారు. అయితే కొందరు పార్టీలోనే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి పార్టీని వీడడం కొంత భిన్నంగా ఉంది. రేవంత్ పార్టీని వీడడానికి సింగిల్ అంశమే ఉంది.

టిఆర్ఎస్ తో పొత్తు వద్దు... కేసిఆర్ మీద పోరాటం ఆపొద్దు అన్నదే రేవంత్ ప్రధాన ఎజెండా. కానీ తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ కు దగ్గరవుతున్న వాతావరణం నెలకొడంతో రేవంత్ టిడిపిలో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ తీరా ఆయన నెగ్గలేకపోయారు. రాజకీయాల్లో వ్యాపారాలు, వ్యవహరాలను అంచనా వేసిన రేవంత్ తుదకు టిడిపిని వీడక తప్పదని నిర్ణయానికి వచ్చారు. అంతిమంగా గుడ్ బై చెప్పారు.

తెలుగుదేశం పార్టీలో రేవంత్ ఎదిగిన తీరు ఇది.

2008 లో టీడీపీ లో చేరి అంచలంచెలుగా ఎదిగి వర్కింగ్ ప్రసిడెంట్ అయ్యాడు రేవంత్.

అతి కొద్ది రోజుల్లోనే టీడీపీ క్యాడర్ లో చెరగని ముద్రవెసుకున్నారు రేవంత్.

2006 లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ZPTC గా ఇండిపెండెంట్ గా పోటీ చేసి సత్తా చాటిండు.

2008 లో జరిగిన mlc ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగి కాంగ్రెస్ ను ఓడించి ఎమ్మెల్సీ అయ్యాడు.

తన బంధువులు అందరూ కాంగ్రెస్ లో ఉన్నా రేవంత్ మాత్రం 2008 లో టీడీపీ లో చేరారు.

చేరినప్పటి నుండి కూడా అధ్యక్షుడు కి నమ్మినబంటుగా మరినాడు రేవంత్.

పార్టీ సంక్షోభం లో ఉన్న చాలా సార్లు ముందు ఉండి పోరాడిన రేవంత్.

2014 తరువాత తెలంగాణ టీడీపీని ఒకే ఒక్కడు అయ్యి నడిపించిన రేవంత్.

పార్టీలో శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనాడు రేవంత్.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/jZLKb4