టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా కేటీఆర్ కు టీఆర్ఎస్ నేత, బావ హరీష్ రావు అభినందనలు తెలిపారు. ట్విటర్లో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేటీఆర్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా కేటీఆర్ కు టీఆర్ఎస్ నేత, బావ హరీష్ రావు అభినందనలు తెలిపారు. ట్విటర్లో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేటీఆర్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
హరీష్ రావు అభినందనలు అందుకున్న కేటీఆర్ వెంటనే ట్విట్లర్లో స్పందించారు. మెనీ థాంక్స్ బావా అంటూ రిప్లై ఇచ్చారు. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ వర్కిగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేశారు. ఆ పదవిని ఆయన తనయుడు కేటీఆర్ కు కట్టబెట్టారు.
ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తానని చెప్పిన కేసీఆర్ అన్నట్లుగానే ఆయన జాతీయ రాజకీయాలపై పట్టుకోసం పరితపిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఇతర పార్టీ నేతలను కలిసి థర్డ్ ఫ్రంట్ కు మద్దతు కోరారు.
2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల మద్దతు కోసం పర్యటనలు చేపట్టాల్సి ఉండటంతో రాష్ట్ర నాయకత్వాన్ని కేటీఆర్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు పలువురు అభినందనలు తెలిపారు. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతలన సక్రమంగా నిర్వహిస్తానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. కేసీఆర్ పై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టడానికి తాను సాయశక్తులా కృషి చేస్తానని ట్వీట్ చేశారు.
కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..
కేటీఆర్ కు అసలు సవాల్ హరీష్ రావే...
పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్
కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్
