ఇదిలా ఉండగా... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసింది. 

కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు 2009 నవంబర్‌ 29న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నారు. కాగా... ఈ రోజును గుర్తుచేస్తూ.. తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘నేడు దీక్షా దివస్..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 
అలుపెరగని పోరాటం చేసిన మన 
ఉద్యమ నేత కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగి తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు. #DeekshaDivas’ అంటూ హరీష్ రావు ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

Also Read: కోల్డ్ కేస్’ సినిమా చూసి.. కూల్ గా హత్య.. మీసేవ ఆపరేట్ హత్యకేసులో సంచలనం...

ఇదిలా ఉండగా... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసింది.

తెలంగాణ సమాజం యావత్తు కేసీఆర్ వెంట నిలవడంతో..కేంద్రం మెడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణలో మాత్రమే కాకుండా.. అమెరికాలోని అట్లాంటా, న్యూజెర్సీలో నవంబర్‌ 29న దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Also Read: ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించండి: టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఆదేశం

ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తించి ప్రపంచ దేశాలలో దీక్ష దివస్ ని జరపాలని ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. అలాగే దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ అమరులకు అలాగే తెలంగాణ ఉద్యమ అమరులకు నివాళులు అర్పించాలని కోరారు.