MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను..? తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే

Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను..? తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే

Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను రెడీ అవుతోందా..? అంటే వాతావరణ నిపుణుల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. అంటే ఈ వర్షాకాలంలో మొదటి తుపాను ఏర్పడితే భారీ వర్షాలతో బీభత్సం తప్పదు. త్వరలో ఇదే జరగబోతోందా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 01 2026, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జూలైలో జోరువానలు
Image Credit : Generated by google gemini AI

జూలైలో జోరువానలు

IMD Rain Alert : మే ఎండింగ్ లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఎంటర్ అవుతాయి... అప్పట్నుండి జోరువానలు కురుస్తాయని వాతావరణ నిపుణులు భావించారు. కానీ వారి అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి... జూన్ వచ్చేవరకు రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వలేదు. ఈ జూన్ నెలంతా రుతుపవనాల విస్తరణకే సరిపోయింది... అందుకే వర్షాల జాడ లేదు. 

అయితే జూలైలో పరిస్థితి పూర్తిగా మారిపోనుందట... వర్షాలు కాదు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు జోరందుకున్నాయి... ఈ నెలలో కుండపోత తప్పదంటున్నాయి తెలంగాణ, ఏపీ వాతావరణ శాఖలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారితే..?
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారితే..?

ఇప్పటికే నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గా మారాయి. అలాగే ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతోంది. దీంతో రెండుమూడు రోజులుగా ఆంధ్ర, ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత పెరిగింది. అయితే మరో రెండ్రోజుల్లో వాతావరణ పరిస్థితులు వర్షాలకు మరింత అనుకూలంగా మారతాయని వాతావరణ శాఖ చెబుతోంది. జూలై 3 (శుక్రవారం) నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది.

అయితే బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం మరింత బలపడితే వర్షాలు కూడా మరింత జోరందుకుంటాయి. ఇది క్రమక్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారితే మాత్రం కుండపోత వర్షాలుంటాయి. అంటే ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు కాస్త అతిబారీ వర్షాలుగా మారతాయన్నమాట... అప్పుడు వరదలు కూడా సంభవించే ఛాన్సెస్ ఉంటాయి.

⚠️ జూలై 3 (శుక్రవారం) నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.#Lowpressure #DisasterManagement #weather #RainUpdate #Lowpressure

— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 30, 2026

35
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
Image Credit : Gemini AI

నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు

ఇదిలావుంటే ఇవాళ (జూలై 1, బుధవారం) ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలుంటాయని హెచ్చరించింది. అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలే కురుస్తాయి... కొన్నిచోట్ల మాత్రం భారీ వర్షాలుండే అవకాశాలున్నాయంటోంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడొచ్చని APSDMA ప్రకటించింది.

45
నేడు తెలంగాణలో వర్షాలు
Image Credit : Gemini

నేడు తెలంగాణలో వర్షాలు

ఇప్పటికే ఉత్తర, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇవి ఇవాళ (జూలై 1, బుధవారం) కూడా కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడవుతాయని... గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

55
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాలివే..
Image Credit : Gemini AI

తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాలివే..

తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినట్లుగానే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని అంటున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయని వెదర్ మ్యాన్ తెలిపారు.

హైదరాబాద్ విషయానికి వస్తే.. ఆకాశం పాక్షికంగా మేఘాలతో నిండివుంటుందని వెదర్ మ్యాన్ ప్రకటించారు. సాయంత్రం లేదా రాత్రి వేళలో నగరంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయట. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
Now Playing
తెలంగాణలో ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్ ఏపీలోనూ జోరువానలు | Heavy Rain Alert in Telangana & AP
Recommended image2
Heavy Rain Alert : రుతుపవనాలు అలర్ట్, అల్పపీడనం క్రియేట్, ద్రోణి, ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలపై ఇక వర్షాల దండయాత్రే, ఈదురుగాలులతో దబిడిదిబిడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved