MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • July Holidays : తెలుగు స్టూడెంట్స్ కి ఊహించని సెలవులు.. జూలై 2, 10న విద్యాసంస్థలు బంద్

July Holidays : తెలుగు స్టూడెంట్స్ కి ఊహించని సెలవులు.. జూలై 2, 10న విద్యాసంస్థలు బంద్

అసలు ఒక్క సెలవు కూడా లేని ఈ జూలై నెలలో ఊహించని విధంగా హాలిడేస్ పెరుగుతున్నాయి. రేపు (జూలై 2న), మళ్ళీ జూలై 10న అంటే రెండ్రోజులు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఎందుకో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 01 2026, 02:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జూలైలో ఊహించని సెలవులు
Image Credit : Getty

జూలైలో ఊహించని సెలవులు

School Holiday : జూలైలో పండగలు, ప్రత్యేక రోజులు ఏమీ ఉండవు... అందుకే తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు కేవలం ఆదివారాలు, రెండో శనివారం తప్ప ఇతర సెలవులేమీ ఉండవు. అంటే విద్యార్థులు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లాల్సిందే. కానీ ఈ జూలైలో తెలంగాణ విద్యార్థులకు ఊహించనివిధంగా సెలవులు వస్తున్నాయి. మరి ఏరోజు, ఎందుకు స్కూళ్లు మూతపడనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జూలై 2న బిసి సంఘాల బంద్
Image Credit : Getty

జూలై 2న బిసి సంఘాల బంద్

ఇప్పటికే తెలంగాణలో బిసి సంఘాల బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాలు రెండ్రోజుల బంద్ కు పిలుపునిచ్చాయి. జూన్ 30, జూలై 2న తెలంగాణలో విద్యాసంస్థల బంద్… అయితే నిన్న (జూన్ 30) తరగతుల బహిష్కరణ, కళాశాలల బంద్, కలెక్టరేట్ ముట్టడి, రాస్తారోకోలు చేపట్టాయి విద్యార్థిసంఘాలు.

అయితే ఇవాళ (జూలై 1న) విద్యాసంస్థలు యదావిధిగా నడుస్తాయి. తిరిగి రేపు (జూలై 2, గురువారం) తెలంగాణవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ జరగనుంది. ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడమే కాదు ఈ పథకాన్నే పూర్తిగా ఎత్తివేసే కుట్రలు జరుగుతున్నాయని... అందుకే విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నామని బిసి జెఎసి ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జూలై 2న చేపట్టే రాష్ట్రవ్యాప్త బంద్ కు ప్రతిఒక్కరు సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Related Articles

Related image1
Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో
Related image2
School Holidays 2026-27 : ఈ అకడమిక్ ఇయర్ లో 87 రోజులు సెలవులే.. తెలుగు స్టూడెంట్స్ కి ఏ నెలలో ఎన్ని సెలవులు?
34
జూలై 10న స్కూళ్లు, కాలేజీల బంద్
Image Credit : getty

జూలై 10న స్కూళ్లు, కాలేజీల బంద్

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా పోరాటానికి సిద్దమయ్యాయి. ఇందులో భాగంగానే ఇవాళ (జూలై 1, బుధవారం) హైదరాబాద్ లో AISF, SFI, PDSU, AIFDS, AIDSO, AIPSU వంటి విద్యార్థి సంఘాల నాయకులు సమావేశమై కార్యాచరణ రూపొందించాయి. ఈ సందర్భంగా జూలై 10 (శుక్రవారం) తెలంగాణలోని విద్యాసంస్థల బంద్ చేపట్టాలని నిర్ణయించాయి... ఈ మేరకు పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు నాయకులు. 

అంటే జూలై 10న విద్యాసంస్థలు మూతపడనున్నాయి... స్కూల్, కాలేజీ విద్యార్థులకు అదనంగా సెలవు వస్తుందన్నమాట. విద్యాసంస్థలు స్వచ్చందంగా సెలవు పాటించకున్నా విద్యార్థి సంఘాల నాయకులు మూసివేయించే అవకాశాలుంటాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా విద్యంసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తమకు సహకరించాలని... బంద్ ను పాటించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

44
జూలైలో మరిన్ని సెలవులుంటాయా?
Image Credit : X

జూలైలో మరిన్ని సెలవులుంటాయా?

ఇదిలావుంటే జూలైలో హటాత్తుగా మరికొన్ని సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి... రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ప్రారంభమయ్యాయి... ఇవి తుపానుగా మారితే మాత్రం కుండపోత తప్పదు. ఇలా గత ఏడాది భారీ వర్షాలు, వరదలతో స్కూళ్లకు సడన్ సెలవులు వచ్చాయి... ఈసారి కూడా అలాంటి పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయి. అంటే తెలంగాణ బంద్ లతో పాటు వర్షాల కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సడన్ హాలిడేస్ వస్తున్నాయన్నమాట.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image2
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Recommended image3
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Related Stories
Recommended image1
Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో
Recommended image2
School Holidays 2026-27 : ఈ అకడమిక్ ఇయర్ లో 87 రోజులు సెలవులే.. తెలుగు స్టూడెంట్స్ కి ఏ నెలలో ఎన్ని సెలవులు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved