Asianet News TeluguAsianet News Telugu

ఏయ్ చౌదరి.. ఆగు... రాజ్యసభలో సుజనా పై హరికృష్ణ

మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో  అప్పటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ కురియన్‌ ఎంతగా వారించినా తన మొండిపట్టుదల మాత్రం వీడలేదు.

Harikrishna sensational comments on sujana chowdary
Author
Hyderabad, First Published Aug 30, 2018, 3:26 PM IST

హైదరాబాద్: మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో  అప్పటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ కురియన్‌ ఎంతగా వారించినా తన మొండిపట్టుదల మాత్రం వీడలేదు. తాను చెప్పదల్చుకొన్న  విషయాన్ని  చెప్పాడు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ సమయంలో  తెలంగాణ, ఏపీలలో ఉద్యమాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చింది. 

టీడీపీ తరుపున 2008లో  రాజ్యసభ సభ్యుడిగా హరికృష్ణ ఎన్నికయ్యారు.  పదవీకాలం ఇంకా  ఆరు మసాలు ఉండగానే  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించకూడదని హరికృష్ణ గట్టిగా పట్టుబట్టారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకొన్నా  హరికృష్ణ మాత్రం రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని కోరుకొన్నాడు. తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ కోరుకొనేవాడని  ఆయన గుర్తు చేసేవాడు.

రాష్ట్ర విభజన అంశంపై రాజ్యసభలో  ముందస్తు నోటీసు లేకుండా తెలుగులో హరికృష్ణ మాట్లాడారు.  అయితే ఆనాడు  సభాపతి స్థానంలో కురియన్ ఉన్నాడు.

హిందిలో కానీ, ఇంగ్లీషులో కానీ  మాట్లాడాలని  కురియన్  హరికృష్ణకు సూచించాడు. అయితే  ఓ కవి రెండు పంక్తులను సభలో చదవి మళ్లీ తెలుగులోనే ప్రసంగాన్ని ప్రారంభించారు.అయితే ఆ సమయంలో  సుజానా చౌదరి  లేచి ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో సుజనాచౌదరిని ఏయ్.. సుజనా ఆగు.... అంటూ హరికృష్ణ కొంచెం  ఆవేశంగా మాట్లాడారు. 

ఐయామ్ ఎంపీ... దీ సీజ్ మై కార్డు  అంటూ  హరికృష్ణ  మళ్లీ  తన ప్రసంగాన్ని కొనసాగించారు.  హరికృష్ణ ఏం మాట్లాడుతున్నాడో  తమకు అర్థం కావడం లేదని కురియన్ చెప్పారు.  హిందీలో కానీ,  ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఆయన పదే పదే కోరినా కూడ  హరికృష్ణ పట్టించుకోలేదు.

తాను తెలుగు రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నానని చెబుతూ తెలుగులోనే మాట్లాడుతానని హరికృష్ణ  స్పష్టం చేస్తూ  తాను చెప్పాలనుకొన్న అంశాలను  చెప్పాడు.

చంద్రబాబునాయుడు ఉత్తరం ఇచ్చాడు.... రాష్ట్రాన్ని చీల్చుతున్నామని అంటారా.. అంటూ హరికృష్ణ ఆవేశంగా మాట్లాడారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అంటారా అని హరికృష్ణ ప్రశ్నించారు.

హిందీలో మాట్లాడాలని .. నిబంధనలకు విరుద్దమని కురియన్ పదే పదే కోరాడు. కానీ, తెలుగులోనే హరికృష్ణ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. ఆ ఆరోజు రాజ్యసభలో ఆవేశంగా  హరికృష్ణ తన ప్రసంగాన్ని కొనసాగించాడు.

ఈ వార్తలు చదవండి

హరికృష్ణ అంతిమయాత్ర: పాడె మోసిన చంద్రబాబు, జాస్తి చలమేశ్వర్

హరికృష్ణ వెంట ఎప్పుడూ ఆ ఇద్దరే.

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

నందమూరి కుటుంబానికి ఈ రహదారి శాపం: యాక్సిడెంట్ జోన్లు ఇవే

సిద్దాంతి ముందే హెచ్చరించాడు: అయినా హరికృష్ణ

 

Follow Us:
Download App:
  • android
  • ios