హైదరాబాద్ కు హరికృష్ణ మృతదేహం....వెంట తారక్, కళ్యాణ్ రామ్,చంద్రబాబు, బాలయ్య

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 29, Aug 2018, 1:03 PM IST
harikrishna dead body reached hyderabad
Highlights

 రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సినీనటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతదేహానికి పోస్టు మార్టం కావడంతో హైదరాబాద్ లోని మోహిదీపట్నంలోని ఆయన నివాసానికి తరలించారు. నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో హరికృష్ణ మృతదేహానికి నల్గొండ ప్రభుత్వాస్పత్రికి చెందిన వైద్యుల బృందం పోస్టు మార్టం నిర్వహించింది. అనంతరం హరికృష్ణ పార్దీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సినీనటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతదేహానికి పోస్టు మార్టం కావడంతో హైదరాబాద్ లోని మోహిదీపట్నంలోని ఆయన నివాసానికి తరలించారు. నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో హరికృష్ణ మృతదేహానికి నల్గొండ ప్రభుత్వాస్పత్రికి చెందిన వైద్యుల బృందం పోస్టు మార్టం నిర్వహించింది. అనంతరం హరికృష్ణ పార్దీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

అంబులెన్స్ లో హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి తరలించారు. భౌతికదేహం వెంట సోదరుడు బాలకృష్ణ, కుమారులు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లుఉన్నారు. పార్దీవ దేహం వెంట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రోడ్డు మార్గం ద్వారా మోహిదీపట్నం చేరుకున్నారు. 

కడసారిగా తమ అభిమాన నటుడు, నేతను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో నివాసానికి చేరుకున్నారు. గురువారం మొయినాబాద్‌లోని వ్యవసాయక్షేత్రంలో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

తెలుగుభాషకు ప్రాధాన్యత ఇచ్చిన హరికృష్ణ

పోస్ట్ మార్టం పూర్తి..రేపే అంత్యక్రియలు.. ఎక్కడంటే

హరికృష్ణ మృతి..బోసిపోయిన అఖిలప్రియ పెళ్లి మండపం

హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ స్థాపన వెనక...

loader