Asianet News TeluguAsianet News Telugu

హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ స్థాపన వెనక...

తన బావ, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో విభేదించి నందమూరి హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 

Why Harikrishna launched Anna TDP?
Author
Hyderabad, First Published Aug 29, 2018, 12:53 PM IST

హైదరాబాద్: తన బావ, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో విభేదించి నందమూరి హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సాంకేతికంగా చంద్రబాబు చేతుల్లోకి వెళ్లడంతో ఆయన తన పార్టీకి వేరే పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. 

మరో బావ దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో కలిసి ఆయన అన్న టీడీపిని నెలకొల్పారు. ఈ పార్టీ స్థాపనలో హరికృష్ణకు అత్యంత సన్నిహితుడైన సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తోడ్పాటు అందించారు. 

ఎన్టీ రామారావు నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నందమూరి హరికృష్ణ సహకరించారు. అయితే, పార్టీనీ ప్రభుత్వాన్నీ సొంతం చేసుకున్న తర్వాత చంద్రబాబు వారిద్దరిని నిర్లక్ష్యం చేశారనే భావన ఏర్పడింది. 

దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదని అంటారు. హరికృష్ణకు కూడా అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని చెబుతారు. 

ఈ స్థితిలో తీవ్ర అసంతృప్తికి గురైన హరికృష్ణ దగ్గుబాటి వెంకటేశ్వ రరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద రావు టీడీపీ నుంచి బయటకు వచ్చి అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఈ పార్టీ కార్యాలయం హైదరాబాదులోని ఆబిడ్స్ లో ఉన్న ఆహ్వానం హోటల్ నుంచే నడిచేది. 

అయితే, అన్న తెలుగుదేశం పార్టీ విఫలం కావడంతో ఆ తర్వాత హరికృష్ణ తిరిగి చంద్రబాబు వైపు వచ్చారు. చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. 

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

హరికృష్ణకు అది సెంటిమెంట్....కానీ ఇవాళ అలా ఎందుకు వెళ్లారో మరి: హరికృష్ణ సన్నిహితుడు

హరికృష్ణ మృతి... చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆస్పత్రికి చేరుకున్న తెలంగాణ మంత్రి

హరికృష్ణ మృతి: కారు ప్రమాదం ఎలా జరిగింది?

Follow Us:
Download App:
  • android
  • ios