ఉద్యోగం నిమిత్తం ఇంట్లోని నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి... వేరే ప్రాంతంలోని ఓ లాడ్జిల్ లో శవమై కనిపించాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  నాగోల్ ఫతుల్లాగూడకు చెందిన సైదులు(29) ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు.

రెండు నెలలుగా భార్య మాధవి, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్ నగర్ డివిజన్ శాంతినగర్ లో నివాసముంటున్నాడు. కాగా... పని నిమిత్తం ఈనెల 29వ తేదీన ఉదయం ఇంటి నుంచి వెళ్లిన సైదులు మధ్యాహ్న సమయంలో భార్యతో ఫోన్ లో మాట్లాడాడు. తాను ప్రస్తుతం కోఠిలో ఉన్నానని.. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేసి వస్తానని చెప్పాడు.

Also Read ముస్లిం యువతి ప్రేమ కోసం ఈ హైదరాబాదీ ఏం చేశాడో తెలుసా?...

తర్వాత అతను తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కంగారుపడిన భార్య మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.... సైదులు ఇంటికి వెళ్లకుండా అక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడ ఓ హోటల్ లొ రూమ్ తీసుకొని అందులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

కాగా.. పై అధికారి దగ్గర చేసిన అప్పు తీర్చలేక... ఆ అధికారి పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక చనిపోయినట్లు భార్య ఆరోపిస్తోంది. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.