తన ప్రేమను అంగీకరించలేదని చంపేసేవాళ్లు.. లేదా దాడి చేసే వాళ్లు... ఇంకా లేదంటే ఫోటోలను చూపించి బెదిరించే వాళ్లు ఉన్న ఈ కాలంలో... ప్రేమ కోసం ఏకంగా మత మార్పిడి చేసుకున్న కుర్రాడు కూడా ఉన్నాడు.  తాను ప్రేమించిన ఓ యువతి కోసం హైదరాబాద్ కి చెందిన ఓ కుర్రాడు ఏకంగా తన మతాన్ని మార్చుకున్నాడు. ఏ మతంలో ఉంటే ఏంటి..? తన ప్రేయసి తనకి దక్కితే చాలు అని భావించాడు..

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు(26) క్రైస్తవ మతానికి చెందిన వాడు. కాగా అతను కొంతకాలంగా ఓ ముస్లిం యువతిని ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు.  అయితే తన పెళ్లికి మతం అడ్డుకాకూడదని అతను భావించాడు. ఈ క్రమంలోనే తన క్రైస్తవ మతాన్ని వదిలేసి ముస్లిం మతాన్ని పుచ్చుకున్నాడు. తన పేరును కూడా ఎండీ అబ్దుల్ హుసేన్ గా మార్చుకున్నాడు.

Also Read ప్రియుడి మోసం, బాలిక ఆత్మహత్య.. పోస్టుమార్టంలో ఏంతేలిందంటే...

యువతి తండ్రి షరతు మేరకే తాను ఇస్లాం మతం  స్వీకరించానని అతను చెప్పడం విశేషం. మతం మార్చుకుంటేనే వాళ్ల అమ్మాయితో నా వివాహం జరిపిస్తామని వారు చెప్పారని అందుకే మారానని చెప్పాడు. అయితే... తీరా తాను మతం మారక తాను ప్రేమించిన అమ్మాయిని తనకు ఇవ్వడానికి అతని తండ్రి అభ్యంతరం చెబుతున్నాడని వాపోయాడు.

వెంటనే ఈ విషయంలో ఆ యువకుడు మానవ హక్కుల కమిషన్ ని సంప్రదించాడు. తాను ప్రేమించిన ముస్లిం యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్లు నిరాకరిస్తున్నారంటూ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశాడు. అధికారలుు అతని ఫిర్యాదుని పరిశీలిస్తున్నారు.