చేనేత, మిల్లు వస్త్రాలపై పెంచిన జిఎస్టీ పన్నుని పూర్తిగా రద్దు చేయాలని ప‌ద్మ‌శాలి, చేనేత సంఘాలు హైదరాబాద్ లోని PVT మార్కెట్ కొత్తపేట  మహాధర్నా నిర్వ‌హించాయి. కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై జనవరి 1వ తేదీ నుంచి జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గడ్డుపరిస్థితుల్లో ఉన్న చేనేత రంగానికి ఈ నిర్ణయం పిడుగుపాటు కానుంది.  

చేనేత రంగంపై మ‌రో పిడుగు ప‌డ‌బోతోంది. ఇప్ప‌టికే క‌ష్ట‌కాలంలో ఉన్న చేనేత రంగంపై జీఎస్టీ ప‌న్నుల భారాన్ని మోప‌డానికి కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ సిద్ద‌మ‌య్యింది. దీంతో చేనేత కార్మికుడికి ప‌రిస్థితి మూలిగే న‌క్క‌మీద తాటిపండు పండు ప‌డ్డ‌ట్టుగా మారింది. జనవరి 1 నుంచి చేనేత‌ వస్త్రాలపై 12 శాతం జీఎస్టీ విధించాల‌ని కేంద్రం భావిస్తోంది. దీంతో చేనేత కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే తీవ్ర సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి.. జీఎస్టీ పేరుతో ప‌న్నుల భారం మోప‌డ‌మేమిట‌నీ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి చేనేత సంఘాలు. జీఎస్టీ వల్ల పన్నుల భారాలు పెరిగితే చీరల ధరలు పెరుగుతాయి. దీని వల్ల కొనుగోళ్లు తగ్గుతాయి. తద్వారా చేనేత కార్మికుల ఉపాధిపై దెబ్బపడుతుంది. 

చేనేత రంగం పై మ‌న తెలుగు రాష్ట్రాల్లో 76వేల మగ్గాలు ఉండగా, తెలంగాణలోని సిరిసిల్లలోనే 46వేల మగ్గాలున్నాయి. ఆంధ్రప్రాంతంలో చీరాల,మంగళగిరి తదితర ప్రాంతాల్లో చేనేత మగ్గాలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ల‌క్షలాది మంది ఈ రంగంపై ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పన్నులు పెరిగితే వీరి బ‌తుకు భార‌మవుతాయి. ప‌లు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.

Read Also: Atal Bihari Vajpayee జయంతి.. ప్రముఖుల నివాళులు... సేవల్ని స్మరించుకున్న నేతలు

ఈ క్ర‌మంలో చేనేత, మిల్లు వస్త్రాలపై పెంచిన జిఎస్టీ పన్నుని పూర్తిగా రద్దు చేయాలని ప‌ద్మ‌శాలి, చేనేత సంఘాలు హైదరాబాద్ లోని PVT మార్కెట్ కొత్తపేట మహాధర్నా నిర్వ‌హించాయి. శనివారం ఈ మ‌హాధ‌ర్నా కార్య‌క్ర‌మాన్ని పద్మవంశీ హ్యాండ్లూమ్ టెక్స్ట్ టైల్ మార్కెట్ వద్ద చేపట్టారు. జీఎస్టీ అమలు వ‌ల్ల‌ చేనేత రంగానికి చాలా నష్టం జ‌రుగుతోంద‌ని అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పటికే చేనేతలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమ‌ర్శించారు. జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్‌తో మ‌హాధ‌ర్నాను రూపకల్పన చేస్తున్నామని తెలిపారు.

Read Also: PMSBY: ఏడాదికి రూ. 12 చెల్లిస్తే.. రూ.2 లక్షలు భీమా.. ఎలా అప్లై చేయాలంటే..

సామాన్యులు వినియోగించే వస్తువులపైనా, వస్త్రాలపైనా జీఎస్టీ ని తగ్గించాలనీ, వీలైతే తొలగించాలని చేనేత సంఘాలు కోరుతున్నాయి. జీఎస్టీ తగ్గించాల్సిందిపోయి చేనేత ఉత్పత్తులను ప్రోత్స‌హించాలని కోరుతున్నారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేంత వ‌ర‌కూ రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌లు చేయాల‌నీ, అలాగే. ప‌ట్ట‌ణంలో ప్రతీ రోజు PVT మార్కెట్ ముందు ఏదో విధంగా నిర‌స‌న కార్య‌క్ర‌మ‌లు చేప‌ట్టనున్నారు. కేంద్రం కళ్లు తెరిచేలా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని PVT యాజమాన్యం నిర్ణ‌యించింది. 

Read Also: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు గుడ్ న్యూస్.. ఇక అలాంటి పోస్టులను వెంటనే డిలీట్ చేయొచ్చు..

మహాధర్నా కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ ఎల్ రమణ, మాజీ గ్రంధాలయం చైర్మన్ జెల్ల మార్కండేయ, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ చిలువేరు కాశీనాద్, పద్మశ్రీ గజం అంజయ్య, చేనేత దినోత్సవ రూప కర్త & అఖిల భారత చేనేత విభాగం అధ్యక్షులు యర్రమాద వెంకన్న నేత, అఖిల భారత పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గుండేటి శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు అవ్వారు భాస్కర్, పోచంపల్లి టై &డై అధ్యక్షులు, సినిమా నిర్మాత శ్రీ తడక రమేష్ గారు, కార్యదర్శి లవకుమార్ గారు, ప్రొపెసర్, NATIONAL HANDLOOM బోర్డు మెంబెర్ శ్రీ తడక యాదగిరి, శ్రీ బీసీ సోషల్ మీడియా ఇంచార్జ్ కళ్లేపల్లి రాజు నేత, PVT మార్చంట్ కమిటీ అధ్యక్షులు కైరంకొండ ధనుంజయ, చెరుకు బిక్షపతి త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.