Asianet News TeluguAsianet News Telugu

Atal Bihari Vajpayee జయంతి.. ప్రముఖుల నివాళులు... సేవల్ని స్మరించుకున్న నేతలు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) 97వ జయంతి సందర్భంగా యావత్ భారతం ఆయన్ని స్మరించుకుంటుంది.  ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వాజ్‌పేయి కి నివాళులర్పించారు. భారతదేశాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చేయడానికి అటల్ బిహారీ వాయిపేయి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ తదితరులు కూడా స‌దైవ్ అట‌ల్ ను సంద‌ర్శించుకుని.. పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 

President Kovind, PM Modi pay tribute to Atal Bihari Vajpayee on his birth anniversary
Author
Hyderabad, First Published Dec 25, 2021, 1:48 PM IST

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) జయంతి నేడు. ఈ సందర్భంగా యావ‌త్ భార‌తం ఆయ‌న్ని స్మ‌రించుకుంటుంది. ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని అటల్ సమాధిని సంద‌ర్శించు కుంటున్నారు. ఆయ‌న‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరితో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ తదితరులు స‌దైవ్ అట‌ల్ ను సంద‌ర్శించుకుని.. పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంత‌రం.. దేశ‌ప్ర‌ధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వాజ్‌పేయి కి నివాళులర్పించారు.  ట్విటర్‌లో ప్రధాని మోదీ.. అటల్ వాజ్ వేయిని  స్మరించుకుంటూ... భారతదేశాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చేయడానికి వాయిపేయి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవ భారతీయుల‌కు స్ఫూర్తిదాయకం. వాజ్ పేయి చేసిన అభివృద్ధి పనుల వ‌ల్ల‌ లక్షలాది మంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేశాయని అన్నారు.

Read Also : విద్యార్థినులతో డబుల్ మీనింగ్ డైలాగులు, లైంగిక వేధింపులు.. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అరెస్ట్...

అలాగే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్విట్టర్‌ లో వాజ్‌పేయికి నివాళులర్పించారు.  భార‌త దేశ వైభ‌వాన్ని ప్ర‌పంచ దేశాల‌కు చాటి చెప్పాల‌నేది జీవిత లక్ష్యంగా పెట్టుకుని,  దేశంలో సుపరిపాలన అందించారని గుర్తు చేసుకున్నారు. వాజ్ పేయి తన దృక్పథాన్ని సాకారం చేయడం ద్వారా భారత రాజకీయాలకు కొత్త మార్గాన్ని అందించారని తెలిపారు. ప్ర‌ధానిగా అటల్ జీ .. దూరదృష్టితో  తీసుకున్న అనేక నిర్ణయాలు నేడు బలమైన భారతదేశానికి పునాదిఅని చెప్పారు. అదే సమయంలో దేశంలో సుపరిపాలన యొక్క దృక్పథాన్ని చూపించారని తెలిపారు. అటల్‌జీ చేసిన సేవలను స్మరించుకుంటూ మోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ‘గుడ్ గవర్నెన్స్ డే’ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. అందరికీ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అమిత్ షా. 

వాజ్‌పేయి 1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లోని షిండే కా బడాలో జ‌న్మించారు. ఆయ‌న‌ తల్లిదండ్రులు కృష్ణ బిహారీ వాజ్‌పేయి, కృష్ణ బాజ్‌పేయి.  అటల్ గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీలో డిగ్రీ,  కాన్పూర్‌లోని DAV కళాశాల నుండి రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ ప‌ట్టాల‌ను పొందారు. వాజ్ పేయి తొలిసారి 1957లో బల్రామ్‌ఫూర్ నియోజకవర్గం (జ‌న‌సంఘ్) నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అప్ప‌టి నుంచి అట‌ల్ జీ ఆయ‌న ఎప్పుడు వెనుతిరిగి చూసుకోలేదు. ఆయ‌న దేశంలోని వివిధ ప్రాంతాల (గ్వాలియర్, న్యూఢిల్లీ, లక్నో) నుంచి 10 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయ‌న వాగ్ధాటి, సంస్థాగతమైన నైపుణ్యాల కారణంగా జనసంఘ్‌లో విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నారు.  అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. ఒక‌సారి వాజపేయి ని చూసి.. ఎప్ప‌టికైనా వాజ్ పేయి  దేశ ప్రధాని అవుతాడని ఊహించాడు. 

Read Also : పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే లోన్లు.. జననాల రేటు పెంచడానికి చైనా ప్రోత్సాహకాలు

దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం.. జనసంఘ్ మొత్తం బాధ్యత యువ వాజపేయిపై పడింది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను 1968 లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా ఎంపిక చేశారు.  నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్, లాల్ కృష్ణ అద్వానీ లతో కలిసి జనసంఘ్‌ను జాతీయస్థాయి ప్రాముఖ్యతను సంతరించుకునే దిశగా నడిపించాడు. ఎమర్జెన్సీ తర్వాత.. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. మొరార్జీ భాయ్ దేశాయ్ ప్రధాని కాగా. ఆయ‌న విదేశాంగ మంత్రిగా అటల్ బిహారీ వాజ్ పేయి పనిచేశారు. ఆ సమయంలో అట‌ల్ జీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో హిందీ భాషలో ప్రసంగించారు. యూఎన్ఓ లో హిందీలో ప్ర‌సంగించిన మొదటి నాయకుడు వాజ్‌పేయి గా నిలిచారు. అప్పటి వరకూ ఈ ప్రపంచ వేదికపై ఎవరూ హిందీలో ప్రసంగం చేయలేదు. 

1995లో  వాజ్ పేయి.. జాతీయవాద భావజాలంతో భారతీయ జనతాపార్టీ ఏర్పాటు చేశారు.  1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా బి.జె.పి అవతరించింది. దీంతో అప్ప‌టి  రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, వాజపేయిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాడు. దీంతో తొలిసారి వాజపేయి భారత 10వ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ బి.జె.పి ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకొవటంలో విఫలమై, వాజపాయి ప్రభుత్వం సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. పార్లమెంటులో మెజారిటీ పొందలేమని స్పష్టమైన వెంటనే, 13 రోజుల అనంతరం వాజపేయి తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తరువాత‌.. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. 

Read Also : డిసెంబర్ 31లోగా మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే.. లేదంటే కొత్త ఏడాది ఇబ్బందులు తప్పవు..

అనంత‌రం .. 1998లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ అత్య‌ధిక సీట్లు గెలిచింది. దీంతో ఎన్డీయే కూట‌మి నేత‌గా..  అటల్ మళ్లీ ప్రధానమంత్రి పదవికి ఎన్నికయ్యారు. కానీ ఈ ప్ర‌భుత్వానికి తొలుత మద్ద‌తుగా నిలిచిన‌ జయలలిత నాయకత్వంలోని ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏ.ఐ.ఏ.డి.ఎం.కె) పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఏన్డీయే ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది.   అనంతరం 1999 నుంచి 2004 వరకు మూడోసారి భారత ప్రధానిగా ఉన్నారు. వాజ్‌పేయిని  భారత ప్రభుత్వం మార్చి 27, 2015న దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో సత్కరించింది

Read Also : జమ్మూ కశ్మీర్ లో కొసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత.. ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

రతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన వాజ్‌పేయి .. దేశానికి ఎన్నో సేవ‌లు చేశారు. తొలుత మ‌న‌కు వాజ్ పేయి అన‌గానే గుర్తుకు వ‌చ్చేది  పోఖ్రాన్ అణుపరీక్ష. ఆయ‌న 1998లో పోఖ్రాన్ అణుప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి శ‌త్రుదేశాల వెన్నులో వ‌ణుకుపుట్టించారు.  అలాగే.. భార‌త్ ను దొంగ దెబ్బ తీయాల‌ని భావించిన పాకిస్తాన్ కు 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం తో స‌మాధానం చెప్పాడు. అలాగే.. స‌రిహ‌ద్దు దేశాల‌తో స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణ  సృష్టించాడానికి ఢిల్లీ-లాహోర్ బస్సు సర్వీస్ ఫిబ్రవరి 1999లో ప్రారంభించబడింది. ఇది భారతదేశం,  పాకిస్తాన్ మధ్య సంబంధాలలో ఒక చారిత్రాత్మక చర్య అంటూ ప్రశంసలు అందుకుంది. చివ‌రిగా.. ఆయ‌న అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటూ 16 ఆగస్టు 2018న  వాజ్‌పేయి మరణించారు. 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పండిట్ గోవింద్ బల్లభ్ పంత్ అవార్డును కూడా అందుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios