MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • జి‌ఎస్‌టి రూల్స్: ఈ ప్రత్యేక మార్పులు కొత్త సంవత్సరం నుండి అమల్లోకి..

జి‌ఎస్‌టి రూల్స్: ఈ ప్రత్యేక మార్పులు కొత్త సంవత్సరం నుండి అమల్లోకి..

కొత్త ఏడాది జనవరి 1 2022 ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో పాటు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి పలు నిబంధనలు కూడా మారబోతున్నాయి. ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) జి‌ఎస్‌టి రీఫండుకు సంబంధించి పెనాల్టీ, ట్యాక్స్ డిపాజిట్‌కు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది.   

2 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 25 2021, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కాబట్టి  రీఫండ్ క్లెయిమ్ ఆగిపోతుంది 
CBIC కూడా ఈ మార్పులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం, జీఎస్టీ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయని వ్యాపారవేత్తలు జనవరి 1 నుండి  పరిమితులు, ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే డీలర్లు క్లెయిమ్ చేసిన రీఫండ్‌లు నిలిపివేయబడతాయి. దీనితో పాటు, ఏదైనా కారణం వల్ల రిజిస్ట్రేషన్ రద్దు చేయబడితే, అలాగే వారి వ్యాపార రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు దరఖాస్తు చేయలేరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇ-వే బిల్లు ట్రాన్స్పోర్ట్  
ఇ-వే బిల్లు ద్వారా గూడ్స్ రవాణా చేయడంలో పొరపాటు ఉంటే ఇప్పుడు పన్ను నిబంధనను తొలగించడం ద్వారా జరిమానా నేరుగా రెట్టింపు చేయబడుతుంది. ఇప్పుడు పెనాల్టీకి వ్యతిరేకంగా అప్పీల్ చేస్తే దానిలో 25 శాతం నింపిన తర్వాత మాత్రమే ఉన్నత స్థాయిలో అప్పీల్ ఉంటుంది. ఇంతకు ముందు పన్నులో 10 శాతంగా నిర్ణయించారు.

34

తక్కువ పన్ను చెల్లించడంలో కఠినత
ఇది కాకుండా సీబీఐసీ నోటిఫికేషన్ ప్రకారం, పన్ను తక్కువగా ఉంటే లేదా చెల్లించకపోతే తీసుకునే చర్యలో కూడా భారీ మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు ఇలా చేసిన వారిపై బ్యాంకు ఖాతాలు లేదా ఆస్తులను అటాచ్ చేయడానికి సుదీర్ఘ నోటీసు ప్రక్రియ ఉండేది ఇప్పుడు దానిని రద్దు చేయబడింది. అంటే ఇప్పుడు నోటీసు లేకుండా ఆస్తిని అటాచ్ చేస్తారు. చాలా సార్లు వ్యాపారవేత్తలు తక్కువ అమ్మకాలు చూపించి తక్కువ పన్ను చెల్లించేవారు లేదా నకిలీ కంపెనీల బిల్లులతో తక్కువ పన్ను చెల్లించేవారు.

44

జీఎస్టీ చట్టంలో ప్రభుత్వం మార్పులు
కంపెనీల సౌలభ్యం కోసం జీఎస్టీ చట్టంలో ప్రభుత్వం మార్పులు చేస్తుందని ఆర్థిక వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జయంత్ సిన్హా తెలిపారు. ఆధార్, యూపీఐ వంటి పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన నిబంధనలు కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయని జయంత్ సిన్హా గురువారం చెప్పారు.


ASSOCHAM సమావేశంలో, జయంత్ సిన్హా కంపెనీల పెరుగుదల, పరిమాణానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిఎస్‌టిపై ఇన్‌వాయిస్‌ల రూపంలో ఉన్న మొత్తం డేటాను ట్రేడ్‌లతో అనుసంధానం చేయాలని మా కమిటీ సూచించిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం దానిని ఆమోదించినందుకు మేము సంతోషిస్తున్నాము అని అన్నారు.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved