Asianet News TeluguAsianet News Telugu

వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు గుడ్ న్యూస్.. ఇక అలాంటి పోస్టులను వెంటనే డిలీట్ చేయొచ్చు..

వాట్సప్ లో మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. వినియోగదారులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న గ్రూప్ అడ్మిన్ డిలీట్ ఆప్షన్ ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సప్ ప్రయత్నిస్తోంది. 

Good news for WhatsApp group admins .. such posts can be deleted immediately ..
Author
Hyderabad, First Published Dec 16, 2021, 11:26 AM IST

వాట్సప్.. మెసెంజింగ్ సర్వీస్ యాప్ లలో దీని రాక సంచలనం. మెసెంజింగ్ స‌ర్వీస్ ల‌లో ఇది విప్ల‌వాత్మ‌కమైన మార్పులు తీసుకొచ్చింద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. నేడు వాట్స‌ప్ ఉప‌యోగించ‌ని స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ లేరంటే న‌మ్మ‌కుండా ఉండ‌లేం. పొద్దున లేచిన ద‌గ్గర నుంచి రాత్రి ప‌డుకునేంత వ‌ర‌కు దీనిని ఉప‌యోగిస్తూనే ఉంటాం. ఈ వాట్స‌ప్ ఎన్నో ర‌కాలుగా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతోంది. ఈ వాట్స‌ప్ రావ‌డం వ‌ల్ల క‌మ్యూనికేష‌న్ చాలా సుల‌భం అయిపోయింది. 

కొత్త ఫీచ‌ర్స్ అందుబాటులోకి..
వాట్స‌ప్ ఎప్పటికప్పుడు త‌న‌ని తాను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ వ‌స్తోంది. దీనిని 2009 సంవ‌త్స‌రంలో కనిపెట్టినప్పటికీ 2011లో ఇది పాపులర్ అయ్యింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వాట్స‌ప్‌కు 2 బిలియ‌న్ యాక్టివ్ యూస‌ర్స్ ఉన్నారు. ఇప్ప‌టిక‌ప్పుడు దీనిని అప్‌డేట్ చేస్తూ ఉండటం వ‌ల్ల ప్ర‌తీ ఏటా దీనికి కొత్త యూస‌ర్‌లు పెరుగుతున్నారు. అల్రేడి వాడుతున్న వారు వేరే యాప్‌కు వెళ్లిపోకుండా దీనినే వాడుతున్నారు. ఈ వాట్స‌ప్ ద్వారా మెసెజెస్, వాయిస్ మెసెజెస్ షేర్ చేసుకోవ‌డంతో పాటు వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్స్ పంపించుకోవ‌చ్చ‌నే విష‌యం అంద‌రికే తెలిసిందే. 2016 న‌వంబ‌ర్ నెల నుంచి ఇందులో వీడియో కాల్ చేసుకునే స‌దుపాయం కూడా క‌ల్పించారు. దీంతో స్కైప్ వంటి యాప్‌లు వాడ‌కుండా చాలా మంది ఈ వాట్స‌ప్ ద్వారానే వీడియో కాల్ చేసుకుంటున్నారు. 

త్వ‌ర‌లో అందుబాటులోకి ‘డిలేట్’ ఆప్ష‌న్‌
ప్ర‌తీ ఏటా వాట్సప్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంస్థ కొత్త కొత్త మార్పులు తీసుకొస్తోంది. అందులో భాగంగానే 2017లో డిలేట్ ఫ‌ర్ ఎవ‌రీ వ‌న్ అనే ఆప్ష‌న్ తీసుకొచ్చింది. పొర‌పాటున ఎవ‌రికైనా రాంగ్ మెసెజ్ పంపితే గ‌తంలో ఆ మెసెజ్‌ను వెనక్కి తీసుకునే స‌దుపాయం లేదు. ఒక గ్రూప్ ఫార్వ‌ర్డ్ చేసే మెజేస్ వేరే గ్రూప్ లో పంపించిన‌ప్పుడు చాలా స‌మ‌స్య‌లు ఎదుర‌య్యేవి. దీనిని గ‌మ‌నించిన వాట్స‌ప్ నాలుగేళ్ల క్రితం డిలీట్ ఫ‌ర్ ఎవ‌రీ వ‌న్ అనే ఆప్ష‌న్ తీసుకొచ్చింది. దీంతో చాలా స‌మ‌స్య‌లు క్లియ‌ర్ అయ్యాయి. అయితే దీనిని మొద‌ట్లో కొంత స‌మ‌యం వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చే వారు. ఇప్పుడు దాదాపు ఆ స‌మయాన్ని గంట ఎనిమిది నిమిషాల వ‌ర‌కు పెంచారు. దీంతో ఇత‌ర గ్రూప్‌కు, ఇత‌ర వ్య‌క్తికి పంపిన మెసేజ్‌ను గంట ఎనిమిది నిమిషాల్లోపు వెన‌క్కి తీసుకునే అవ‌కాశం ల‌భించింది. ఈ ఫీచ‌ర్ ఎంతో మందికి ఉప‌యోక‌రంగా ఉంది. 

ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021: మెటావర్స్ ఒక కొత్త ప్రపంచం, మా నాన్న కల నాకు చాలా ముఖ్యమైనది..
అయితే గ్రూప్ అడ్మిన్ల‌కు కూడా ఇలాంటి స‌దుపాయం ఇవ్వాల‌ని చాలా రోజుల నుంచి వాట్స‌ప్ వినియోగ‌దారులు కోరుతున్నారు. ఈ ఆప్ష‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది గ్రూప్ అడ్మిన్లు చిక్కుల్లో ప‌డుతున్నారు. కొన్ని సార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిర‌గాల్సి వ‌స్తోంది. ఆ గ్రూప్‌లో అడ్మిన్‌గా ఉన్నందుకు అందులో వ‌చ్చే ప్ర‌తీ పోస్ట్‌కు అడ్మినే భాద్య‌త వ‌హించాల్సి ఉంటుంది. ఇది చాలా సంద‌ర్భాల్లో ఇబ్బందిగా మారుతోంది. దీనిని నివారించ‌డానికి గ్రూప్ అడ్మిన్ కూడా డిలీట్ చేసే అవ‌కాశాన్ని ఇవ్వాల‌ని వాట్స‌ప్ భావిస్తోంది. అందులో భాగంగానే గ్రూప్ అడ్మిన్‌ల‌కు ఆయా స‌భ్యులు చేసే పోస్టుల‌ను డిలీట్ చేసేందుకు కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి తెచ్చింది. ప్ర‌స్తుతం ఇది కొంద‌రు బెటా వ‌ర్ష‌న్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో అంద‌రికీ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్స‌ప్ స‌న్నాహ‌కాలు చేస్తోంది. ఈ ఫీచ‌ర్ వ‌స్తే ఇక అడ్మిన్‌ల‌కు పోస్టులు డిలీట్ చేసే హ‌క్కు వ‌స్తుంది. ‘ఈ మెసేజ్ అడ్మిన్ ద్వారా డిలీట్ చేయ‌బ‌డింది’ అని డిలీట్ చేసిన పోస్ట్ వద్ద కనిపిస్తుందని వాట్సప్ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios