బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడొకరు రాజీనామా చేశారు. ఆయన ఎవరు, ఏ జిల్లా అధ్యక్షుడు, ఎందుకు రాజీనామా చేశారు? అనేది ఇక్కడ తెలుసుకుందాం. 

DID YOU
KNOW
?
అప్పట్నుంచి గువ్వల ఇక్కడే
గువ్వల బాలరాజు తెలంగాణ ఏర్పాటుకు ముందునుండి బిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఆయన 2009లోనే నాగర్ కర్నూల్ లోక్ సభకు పోటీచేసి ఓటమిపాలయ్యారు.

Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న భారత రాష్ట్ర సమితికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈ పార్టీకి పలువురు ఎమ్మెల్యేలు హ్యాండివ్వగా తాజాగా మరొకరు కూడా రాజీనామా చేశారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) కు పంపించారు.

గువ్వల బాలరాజు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు... బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లపాటు అచ్చంపేట ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ లో చాలామంది నేతల మాదిరిగానే బాలరాజు కూడా ఓటమిపాలయ్యాడు. అయితే బిఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయనను నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు కేసీఆర్. సడన్ గా బాలరాజు బిఆర్ఎస్ కు రాజీనామా చేయడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.

Scroll to load tweet…

బాలరాజు ప్లాన్ అదేనా?

గువ్వల బాలరాజు చాలాకాలంగా బిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు... మరి ఇంత సడన్ గా రాజీనామా చేయడానికి కారణం ఏమిటై ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే బిఆర్ఎస్ లో అంతర్గత విబేధాలే బాలరాజు రాజీనామాకు కారణమై ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఓవైపు అధికారాన్ని కోల్పోవడం... మరోవైపు కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య నెలకొన్న విబేధాలు... సొంత రాజకీయ ప్రయోజనాలు... ఇవే బాలరాజును బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా దిశగా నడిపించి ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే బాలరాజు బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యాడు... ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాకే రాజీనామా చేసినట్లు సమాచారం. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు, ఎంపీ డికె అరుణతో చర్చల అనంతరం బాలరాజుకు బిజెపిలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని… దీంతో ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.

గువ్వల బాలరాజు బాటలోకి మరో మాజీ ఎమ్మెల్యే?

ఇప్పటికే కేటీఆర్, కవిత మధ్య ఆదిపత్యపోరు, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్, హరీష్ రావు విచారణ... ఇలా బిఆర్ఎస్ కష్టకాలంలో ఉంది. అలాగే బిఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది కాంగ్రెస్ లో చేరారు. ఇలా కష్టకాలంలో ఉన్న బిఆర్ఎస్ బాలరాజు మాత్రమే కాదు మరికొందరు నాయకులు కూడా షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా బిఆర్ఎస్ ను వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఇతడు కూడా బిజెపితోనే టచ్ లో ఉన్నాడని... కాషాయ పార్టీ అదిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే బిఆర్ఎస్ కు రాజీనామా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. అయితే అబ్రహం మాత్రం ఈ ప్రచారంపై స్పందించడంలేదు.