ఐఎస్‌కేపీ ఉగ్రవాద సంస్థ దేశ వ్యాప్తంగా  నెట్ వర్క్ ను  ఏర్పాటు  చేసుకొనే  ప్రయత్నం  చేస్తున్న విషయాన్ని ఏటీఎస్ గుర్తించింది.  గుజరాత్, హైద్రాబాద్ లలో అరెస్టు  చేసిన  ఇద్దరు మహిళల  నుండి ఏటీఎస్ కీలక సమాచారం సేకరించింది. 

హైదరాబాద్: ఐఎస్‌కేపీ ఉగ్రవాద సంస్థ నెట్ వర్క్ లింక్ లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.గుజరాత్ లో ఇంతకుముందే అరెస్టైన నలుగురు ఉగ్రవాదులతో దాడులకు ప్లాన్ చేశారని ఏటీఎస్ బృందం తమ దర్యాప్తులో తేల్చింది. 

గుజరాత్, హైద్రాబాద్ లలో అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళలను విచారించిన సమయంలో ఏటీఎస్ బృందం కొత్త విషయాలను గుర్తించింది. గుజరాత్ లో ఖదీజా అలియాస్ అబిదా , హైద్రాబాద్ లో సుబేరా భానును ఏటీఎస్ బృందం అరెస్ట్ చేసింది. ఆబిదా , సుబేరాతో ఎవరెవరు కాంటాక్టులో ఉన్నారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నెట్ వర్క్ ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాలను ఈ ముఠా చేసిందని ఏటీఎస్ గుర్తించింది. ఫిదాయి దాడులకు ఈ ముఠా ప్లాన్ చేసిందని ఏటీఎస్ బృందం తేల్చిందని సమాచారం. గుజరాత్, కాశ్మీర్, యూపీ, తెలంగాణలో నెట్ వర్క్ ను విస్తరించినట్టుగా ఏటీఎస్ తమ దర్యాప్తులో తేల్చిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

హైద్రాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ట్రైనర్ గా పనిచేస్తున్న వ్యక్తితో పాటు ఆయన కూతురును ఏటీఎస్ అదుపులోకి తీసుకొని విచారించింది. వీరికి దేశ వ్యాప్తంగా ఎవరెవరితో సంబంధాలున్నాయనే విషయమై ఆరా తీస్తున్నారని ఈ కథనం తెలిపింది.

also read:తెలంగాణలో మరోసారి ఉగ్రలింకుల కలకలం.. గుజరాత్‌ ఏటీఎస్ అదుపులో తండ్రీకూతుళ్లు, మెడికల్ షాప్ ఓనర్!!

ఇటీవలనే హైద్రాబాద్ కేంద్రంగా గుజరాత్ , తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి రాడికల్ ఇస్లామిక్ సంస్థతో సంబంధాలున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ సాగుతున్న తరుణంలోనే ఐఎస్‌కేపీ అంశం వెలుగు చూసింది.