ఎర్రవెల్లి డబుల్ బెడ్ రూం ఇళ్లకు వాస్తుదోషమట

govt double bedroom have vasthu dosha says expert
Highlights

తన ఇంటిని పక్కా వాస్తుతో నిర్మించుకున్న సీఎం కేసీఆర్ పేదోళ్ల డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో వాస్తు చూడలేదా?

 

వాస్తు ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే వార్త ఇది.

 

కేసీఆర్ దత్తత గ్రామంలో ప్రభుత్వ ఖర్చు తో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లకు వాస్తు దోషం ఉందట.

 

దీని వల్ల ఆ ఇళ్లలో నివసిస్తున్నవారు తీవ్ర అనారోగ్యంతో చనిపోయే అవకాశం ఉందట.  

 

హైదరాబాద్ లో వాస్తు ప్లానర్ గా పేరుతెచ్చుకున్న వాసవి వాస్తు ప్లానర్స్ అధినేత ప్రకాశ్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.


వాస్తు లేకుండా ఏ పని చేయని  సీఎం ఇలా పేదోడి ఇళ్ల నిర్మాణం విషయంలో ఈ విషయాన్ని ఎందుకు గమనించలేదోమరి.

 

తన నివాస గృహానికి వాస్తు బాగా లేదని కోట్ల రూపాయిలు వెచ్చించి కొత్త ఇంటిని ఇటీవల సీఎ నిర్మించుకున్నారు. అది కూడా పక్కా వాస్తు తో...

 

అలాగే, త్వరలో వాస్తు బాగాలేదని అనుకుంటున్న సచివాలయాన్ని కూడా పూర్తిగా కూలగొట్టి కొత్త నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు.

 

కాగా, సీఎం దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో దాదాపు 600ల డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు.

loader