ప్రయాణికలు ఈ విషయం గమనించి ఆ కిలాడీ లేడీని నిలదీశారు. దీంతో ఆ యువతి అక్కడి నుంచి ఉడాయించింది.

పుణ్యానికి పోతే పాపం ఎదరైందట.. అలానే ఉంది పాపం హైదరాబాద్ లో ఓ యువకుడి పరిస్థితి.నిన్న హైదరాబాద్ లోని మసాబ్ ట్యాంక్ నుంచి హిమాయత్ నగర్ వైపు ఓ యువకుడు బైక్ పై వెళుతున్నాడు. ఇంతలో బురఖా వేసుకున్న ఓ అమ్మాయి అతడిన్ని లిఫ్ట్ అడిగింది.

అసలే ఎండాకాలం.. పైగా మధ్యాహ్నం... లిఫ్ట్ ఇచ్చి ఆదుకుందామని ఆ అబ్బాయి తన బైక్ ఎక్కించుకున్నాడు. తీరా స్టాప్ వద్దకు రాకముందే ఆ కిలాడీ లేడీ బైక్ దిగి అతడ్ని డబ్బులివ్వాలని డిమాండ్ చేసింది. లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో బిత్తరపోవడం ఆ యువకుడి వంతు అయింది. అయితే పక్కనే ఉన్న బస్టాప్ వద్ద ఉన్న ప్రయాణికలు ఈ విషయం గమనించి ఆ కిలాడీ లేడీని నిలదీశారు. దీంతో ఆ యువతి అక్కడి నుంచి ఉడాయించింది.

గతంలో అమీర్ పేట్ లో కూడా ఇలానే ఓ యువతి బురఖాలో వచ్చి ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసింది. అతడు పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సదరు యువతిపై కేసు కూడా నమోదు చేశారు.